క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

17 Jul, 2019 19:16 IST|Sakshi

ముంబై : మన్మధుడు 2 టీజర్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విన్యాసాలను చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. అక్కినేని నాగార్జునతో ఈ మూవీలో స్ర్కీన్‌ను షేర్‌ చేసుకుంటున్న రకుల్‌ హైఎండ్‌ యాటిట్యూడ్‌తో కనిపించారు. పొగతాగుతూ రకుల్‌ కనిపించిన సీన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రకుల్‌నే కాకుండా మూవీ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌, ఆయన భార్య, గాయని చిన్మయి శ్రీపాదపైనా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు కొట్టుకోవడం కామన్‌ అంటూ కబీర్‌ సింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగా వ్యాఖ్యలను చిన్మయి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. స్మోకింగ్‌ను ప్రోత్సహించేలా తన భర్త తీసిన సినిమాను చిన్మయి ఎలా సమర్ధిస్తారంటూ నెటిజన్లు నిలదీశారు. ట్రోలింగ్‌పై రకుల్‌ స్పందిస్తూ ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని, కబీర్‌సింగ్‌లో షాహిద్‌ కపూర్‌ సిగరెట్లు తాగినట్టే తాను పాత్ర స్వభావానికి అనుగుణంగా స్మోక్‌ చేశానని ఆమె సమర్ధించుకున్నారు.

నిజజీవితంలో షాహిద్‌ శాకాహారి అని అందరికీ తెలుసునని, రీల్‌లైఫ్‌..రియల్‌లైఫ్‌కు ముడిపెట్టడం సరికాదని రకుల్‌ క్లాస్‌ తీసుకున్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన కథను మాత్రమే తాము చెబుతున్నామని, యువతులంతా ఇలానే ఉంటారని కాదని చెప్పుకొచ్చారు. దీన్ని కేవలం ఒక క్యారెక్టర్‌గానే చూడాలని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!