ఒక్క సినిమా...రెండు కలలు!

10 Nov, 2016 22:46 IST|Sakshi
ఒక్క సినిమా...రెండు కలలు!

‘‘ఏది ఎప్పుడు జరగాలో.. ఎలా జరగాలో.. ప్రతిదీ భగవంతుడు రాసి పెడతాడు. మనమంతా సరైన సమయం కోసం ఎదురు చూడాలంతే. తప్పకుండా కలలు నిజమవుతాయి. ఒక్క సినిమాతో నా రెండు స్వప్నాలు నిజమవుతున్నాయి’’ అంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. మహేశ్‌బాబు హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్, మురుగదాస్... ఇద్దరితోనూ ఈ ఢిల్లీ బ్యూటీకి ఇదే మొదటి సినిమా. రకుల్ నటించిన ఓ కమర్షియల్ యాడ్ చూసిన మురుగదాస్ తన ‘తుపాకీ’లో హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట.

ముంబైలోని కాస్టింగ్ ఏజెన్సీను సంప్రదించగా.. ‘కొత్తమ్మాయి. అప్పుడే సినిమాలో నటించడానికి రెడీగా లేదు’ అని చెప్పారట. దాంతో కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారాయన. ఆ విషయాన్ని తాజా సినిమా షూటింగ్ లొకేషన్లో రకుల్‌తో చెప్పారట మురుగదాస్. అప్పుడు షాకవ్వడం రకుల్ వంతు అయ్యింది. ఎందుకంటే,  మోడల్‌గా ఉన్నప్పట్నుంచీ మురుగదాస్ సినిమాలో నటించాలని రకుల్ కోరిక అట. ‘హాయ్.. సర్! నా పేరు రకుల్. ఐయామ్ ఎ మోడల్. మిమ్మల్ని ఓసారి మీట్ కావాలి...’ అని అప్పుడెప్పుడో ఆమె మెసేజ్ కూడా పంపారట.

ఆ విషయాన్ని మురుగదాస్‌కు చెప్పడంతో పాటు అప్పట్లో ఆయనకు పంపిన మెసేజ్‌ను చూపించారట. ‘‘మురుగదాస్ గత సినిమా విడుదల సమయంలో శుభాకాంక్షలు పంపిన పాత మెసేజ్ కూడా నా ఫోన్‌లో ఉంది. అది ఆయనకు చూపించగా.. నవ్వుకోవడం ఇద్దరి వంతైంది’’ అన్నారు రకుల్. గతంలో మహేశ్ సరసన రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చినా డేట్స్ అడ్జస్ట్ చేయలేక రకుల్ వదులుకున్నారు. ఈ సినిమాతో మహేశ్‌కు జోడీగా నటించాలనే రెండో స్వప్నం కూడా సాకారమైందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా