రొమాంటిక్‌లో గెస్ట్‌

17 Oct, 2019 05:53 IST|Sakshi
రమ్యకృష్ణ, కృష్ణవంశీ

దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి తన కొత్త సినిమా కోసం రొమాంటిక్‌గా మారిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్‌ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్‌’. కేతికా శర్మ హీరోయిన్‌. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ సినిమాలో ఆల్రెడీ బాలీవుడ్‌ భామ మందిరా బేడీ కీలక పాత్ర చేస్తున్నారు.

15 ఏళ్ల తర్వాత...
క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ బాగా ఉంది. ఆయన నెక్ట్స్‌ సినిమాను బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ. అభిషేక్‌ జాకర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ సినిమా ‘నటసామ్రాట్‌’ అనే మరాఠీ సినిమాకు రీమేక్‌. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. 2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. అంటే.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ యాక్ట్‌ చేయబోతున్నారు. అయితే అప్పుడు గెస్ట్‌ రోల్‌. ఇప్పుడు కథానాయిక.

మరిన్ని వార్తలు