ఇంటర్నెట్‌ సెన్సేషన్‌పై నెటిజన్ల మండిపాటు

6 Nov, 2019 14:24 IST|Sakshi

ఒకప్పుడు ఆమె ఓ యాచకురాలు.. కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్‌ సెన్సేషన్‌. కోల్‌కతాలోని రానాఘట్‌ రైల్వేస్టేషన్‌లో లతా మంగేష్కర్‌ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది. ఆమె గాత్రానికి ఫిదా అయిన హిమేశ్‌ రష్మియా రణుతో పాటలు పాడించి ఆమెకు పాపులారిటీని తెచ్చిపెట్టాడు. అయితే ఆమెకు ఇప్పుడు ఆమెకు గర్వం తలకెక్కిందని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. దీనికి ఆమె వ్యవహార శైలే కారణమైంది. రణుమొండాల్‌తో సెల్ఫీ దిగడానికి ఓ మహిళా అభిమాని తహతహలాడింది.

ఫొటో కావాలంటూ చేయితో తాకుతూ పిలిచింది. దీంతో రణు ఆమెపై సీరియస్‌ అయింది. ‘నన్ను చేతితో తాకుతున్నావేంటి, టచ్‌ చేయకు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆటిట్యూట్‌ చూపించుతూ ఆమెను తోసేసింది. అయితే, అభిమాని పట్ల రణు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్కడి నుంచి వచ్చావో మళ్లీ అక్కడికే వెళ్లు అంటూ రణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్త పేరు రాగానే గర్వాన్ని నెత్తికెక్కిచ్చుకుని ఇలా ప్రవర్తించడం ఏమీ బాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Social | Don't touch me; I'm celebrity now. #ranumondal #Kolkata #Bollywood #bollywoodfashion #bollywoodnews #bollywoodcelebrity #Mumbai #Filmcity #IndianHistoryLive

A post shared by Indian History Pictures (@indianhistorylive) on

మరిన్ని వార్తలు