రా రా సరసకు రారా!

21 Feb, 2020 02:58 IST|Sakshi
టబు

‘రారా సరసకు రారా...’ పాట సౌత్‌ ఇండస్ట్రీల్లో సూపర్‌ పాపులర్‌. ‘చంద్రముఖి’లోని ఈ పాటను, పాటలో జ్యోతిక గెటప్‌ను, ఆమె అభినయాన్ని ఎవరూ మర్చిపోలేరు. మలయాళ చిత్రం ‘మణిచిత్ర తాళ్‌’ ఆధారంగా కన్నడంలో ‘ఆప్తమిత్రన్‌’, తెలుగు/తమిళంలో ‘చంద్రముఖి’, హిందీలో ‘భూల్‌ బులేయ్య’, బెంగాలీలో ‘రాజ్‌మొహోల్‌’ సినిమాలు  రూపొందాయి. హిందీ రీమేక్‌లో ‘రారా సరసకు రారా (‘మేరే డోల్‌నా సున్‌’) పాటలో విద్యా బాలన్‌ నర్తించారు. ఇప్పుడు ‘భూల్‌ బులేయ్య’ సీక్వెల్‌ ‘భూల్‌ బులేయ్య 2’లో ఆ పాట రీమిక్స్‌లో డ్యాన్స్‌ చేయనున్నారు టబు. దెయ్యం పట్టిన డ్యాన్సర్‌ గెటప్‌లో ‘రారా సరసకు రారా’ అని పాడనున్నారట. కార్తీక్‌ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ముఖ్య తారలుగా అనీజ్‌ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు