అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన రష్మీ

12 Dec, 2016 15:07 IST|Sakshi
అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన రష్మీ

స్టార్ హీరో అల్లు అర్జున్ సాధించిన ఓ రికార్డ్ను హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ బ్రేక్ చేసింది. ఇటీవల విడుదలైన గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ, ఈ ఫీట్ సాధించింది. ఈ సినిమాలో హాట్ హాట్ సీన్స్తో అలరించిన రష్మీ, అదే రేంజ్లో ఓ పాట కూడా చేసింది. సిద్ధూ అనే కొత్త కుర్రాడితో కలిసి రష్మీ చేసిన రొమాన్స్ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేసింది. వెండితెర మీదే కాదు.. యూట్యూబ్లో కూడా ఈ పాట సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

గతంలో పాటల విషయంలో యూట్యూబ్లో అత్యధిక మంది వీక్షించిన రికార్డ్ అల్లు అర్జున్ పేరిట ఉండేది. అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన రేసుగుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మామ పాటను ఇప్పటి వరకు  కోటీ 90 లక్షల మంది యూట్యూబ్లో చూశారు. అయితే బన్నీ రికార్డ్ను బ్రేక్ చేస్తూ రష్మీ నటించిన హాట్కు  రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా కేవలం మూడు నెలల కాలంలోనే కావటం మరో విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి