ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదు: రష్మీ

2 Apr, 2018 11:58 IST|Sakshi
రాధిక, రష్మీ గౌతమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓ ప్రముఖ న్యూస్ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేస్తున్నవెంకన్నగారి రాధిక (36) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. డిప్రెషన్‌లో ఉన్న రాధిక ఆదివారం రాత్రి 10.40 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చి, అపార్టుమెంట్‌ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పలువురు టీవీ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌ కూడా స్పందించింది. ఆత్మహత్యతో బాధలు పోవని, జీవితాన్ని బాగుచేసుకునే అవకాశాన్ని ఆత్మహత్య దూరం చేస్తుందని రష్మీ ట్వీట్‌ చేసింది.

ఆమెను ఎప్పుడూ కలవలేదని.. కానీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపింది. శారీరక విశ్లేషణే కాదు మానసిక విశ్లేషణ కూడా ముఖ్యం... మానసిక వైద్యుడిని కలిసినంత మాత్రాన మనం పిచ్చివాళ్లమైపోయినట్టు కాదు.. మానసిక ఒత్తిడే ఈ రోజుల్లో మనిషి ప్రాణాలు తీస్తోంది.. డిప్రెషన్‌ అనిపించినప్పుడు స్నేహితులతో, కుటుంబ సభ్యలతో మన బాధలు పంచుకోవాలి.. అంతేకానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. నిద్ర లేవగానే ఇలాంటి వార్తలు వినడం నచ్చడం లేదని రష్మీ ట్వీట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు