నందమూరి-మెగా వివాదం.. మధ్యలో ఆర్జీవీ!

8 Jan, 2019 16:02 IST|Sakshi

గతకొన్ని రోజులుగా మెగా బ్రదర్‌ నాగబాబు చేస్తున్న కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో  ఏరేంజులో దుమారం లేపుతున్నాయో తెలిసిందే. బాలకృష్ణ ఎవరో తెలియదంటూ ఓ ఇంటర్వ్యూలో నాగబాబు అనడం.. పైగా అప్పట్లో కమెడియన్‌ బాలయ్య అనే అతను నాకు తెలుసంటూ చురకలు అంటించడం తెలిసిందే. రాను రాను ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. నాగబాబు ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ పైనా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓ వైపు ఈ రచ్చ జరుగుతూ ఉంటే.. వివాదాలకు కేరాఫ్‌ అయిన రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ఇందులో జాయిన్‌ అయ్యాడు. 

నాగబాబు చేస్తున్న కామెంట్స్‌పై ఆర్జీవీ సోషల్‌ మీడియాలో తన స్టైల్లో కామెంట్‌ చేశాడు. ‘ కామెంట్లో నన్ను మించిపోయారనే నా బాధ ఒక వైపు.. తన స్టార్‌ బ్రదర్స్‌ని సమర్థించుకోవడంలో సూపర్‌ స్టార్‌అయ్యారని ఒకవైపు.. ఒక కంట కన్నీరు.. మరో కంట పన్నీరు.. నాగబాబు గారు హ్యాట్సాఫ్‌.. మీరు మీ బ్రదర్స్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో.. నేనూ అంతే ప్రేమిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు