అయితే వారిద్దరి ప్రేమాయణం నిజమా..?!

21 Jan, 2020 18:10 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ రియా చక్రవర్తి తాజాగా ప్రచారంతో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు బర్త్‌డే విషెష్‌ తెలిపారు. తెలుగులో వచ్చిన ‘తూనీగా తూనీగా’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రియా కొద్ది రోజులుగా ఎంఎస్‌ ధోని ఫేమ్‌ సుశాంత్‌తో రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా సుశాంత్‌కు ఇన్‌స్టామ్‌లో మంగళవారం ప్రత్యేకంగా తెలిపిన బర్త్‌డే విషెస్‌ ఈ గాసిప్స్‌కు ఆజ్యం పోసేలా ఉండటంతో వీరిద్దరూ డేటింగ్‌ విషయాన్ని బహిర్గతం చేశారా ఏంటీ అని నెటిజన్లంతా అభిప్రాయపడుతున్నారు.

వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలకు ‘హ్యాపీ బర్త్‌ డే మై బ్యూటీఫుల్‌ సుపర్‌ మాస్సివ్‌’ అనే క్యాప్షన్‌కు రియా చక్రవర్తి ‘బాయ్‌ విత్‌ గొల్డేన్‌ హార్ట్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసి షేర్‌ చేశారు. కాగా రియా పోస్టుకు సుశాంత్‌ ‘థ్యాంక్యూ మై రాక్‌స్టార్‌’ అని సమాధానం ఇచ్చాడు. అయితే వీరిద్దరి ప్రేమయాణం సంగతి ఎప్పుడూ బహిర్గతం చేయనప్పటికీ తరచూ వీరిద్దరూ రహస్యంగా వెళ్లే టూర్‌ ఫొటోలు, ఒకరి ఫొటోలను ఒకరూ షేర్‌ చేస్తూ అందరికి హింట్‌ ఇస్తూ వస్తున్నారు. 

Happy birthday to the most beautiful ” supermassive black hole “ that is known to mankind ! Shine on you crazy diamond @sushantsinghrajput 💕💥❤️🌈⭐️🍭💜🧡 #boywithagoldenheart #rheality

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

ఇక రీయా చక్రబోర్తి షేర్‌ చేసిన పోస్టులో ఈ జంట పార్కులోని ఓ బల్లపై కూర్చుని పక్కపక్కనే కుర్చుని ఉన్నారు. తననే చూస్తున్నా సుశాంత్‌ మెడపై రీయా చేతులతో చూట్టేసింది. మరొక ఫొటోలో వీరిద్దరూ బీచ్‌ తీరంలోని గుహముందు పడవలో కుర్చుని ఉండగా.. సుశాంత్‌పై రియా వాలిపోయి ఉంది. కాగా ఇటివలే సుశాంత్‌ కూడా తన ఇన్‌స్టాలో రీయా ఫొటోలను షేర్‌ చేస్తూ ‘నా జిలేమీ’ అని పిలిచాడు. ఇక సుశాంత్‌ నటించిన పవిత్ర రిషిత టీవి షోలోని తన సహా నటి అంకితా లోఖండేతో కోన్ని సంవత్సరాల పాటు ప్రేమయాణం సాగించి 2016లో అంకితతో విడిపోయి 2019 నుంచి రీయా చక్రబోర్తితో జతకట్టినట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా