‘నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’

27 Mar, 2020 16:57 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఉగాది కానుకగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు చిత్ర బృందం. అంతేకాకుండా టైటిల్‌ లోగోతో పాటు, చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్‌ పోస్టర్‌లోనే రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ పెంచేశారు. తాజాగా రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఫ్యాన్స్‌కు మరో ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో విడుదలైన సర్‌ప్రైజ్‌ వీడియోలో అల్లూరి సీతారామరాజు(రామ్‌చరణ్‌) క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో పరిచయం చేశారు. ఈ క్రమంలో అల్లూరిని ఇంట్రడ్యూస్‌ చేస్తూ జూనియర్‌ ఎన్టీఆర్‌ అందించిన వాయిస్‌ ఓవర్‌, పలికిన డైలాగ్‌లు హార్ట్‌ బీట్‌ను పెంచేస్తున్నాయి. అంతేకాకుండా రామ్‌చరణ్‌ ఎలివేషన్‌ సీన్స్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఇక కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ డబుల్‌ బోనస్‌. 73 సెకన్ల పాటు సాగిన ‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ వీడియోను తెలుగులో డీవీవీ మూవీస్‌, తమిళంలో ఎన్టీఆర్‌, హిందీలో అజయ్‌ దేవగణ్‌, కన్నడలో వారాహి, మలయాళంలో రామ్‌చరణ్‌లు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.   

ఈ సినిమాలో తెలంగాణ గొండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్‌ చరణ్‌కి జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్, హాలీవుడ్‌ స్టార్స్‌ రే స్టీవెన్‌ సన్స్ , అలిసన్‌ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కానుంది.

చదవండి:
చిరంజీవికి జేజేలు: పవన్‌ కళ్యాణ్‌
నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా