ప్లాన్‌ సిద్ధమైంది

1 Mar, 2020 04:24 IST|Sakshi
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లుక్స్‌ ఎలా ఉండబోతున్నాయి అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టనుందని సమాచారం. మార్చి నెలలో చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన లుక్‌ను విడుదల చేయాలనుకుంటున్నారట. ఆ తర్వాత ఎన్టీఆర్‌ లుక్‌ విడుదల చేయాలని ప్లాన్‌ చేసిందట చిత్రబృందం. ఇలా ప్రమోషన్స్‌ ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా