నేను తప్పులు చేశాను!

27 Jun, 2019 08:23 IST|Sakshi

తానూ తప్పులు చేశాను అంటున్నారు నటి సమంత. ఇతర హీరోయిన్లకంటే ఈ బ్యూటీ ప్రత్యేకం అని చెప్పక తప్పుదు. వివాహానికి ముందు ఆ తరువాత కూడా కథానాయకిగా మార్కెట్‌ను నిలబెట్టుకుంటున్న నటి సమంత. కొన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని రీల్‌ లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ సక్సెస్‌ అయిన నటి ఈ అమ్మడు. మరో విషయం ఏమిటంటే నిజాలను నిర్భయంగా చెప్పే సత్తా కలిగిన నటిగానూ పేరు గాంచింది. ఇప్పటికీ హీరోయిన్ల రేస్‌లో దూసుకుపోతున్న సమంత చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సమంత నటించిన ఓ బేబీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రానుంది.

ఈ సందర్భంగా సమంత ఒక ఇంటర్వ్యూలో తన విజయరహస్యం గురించి తెలుపుతూ అందరి మాదిరిగానే తానూ తప్పులు చేశానని చెప్పింది. అయితే ఆ తప్పుల్ని మళ్లీ దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నానని అంది.  చేసిన తప్పుల నుంచి చాలా పాఠాలను నేర్చుకున్నట్లు చెప్పింది. నిజం చెప్పాలంటే తనకంటే కఠినంగా శ్రమించే వారు, ప్రతిభ కలిగిన వారు ఈ రంగంలో చాలా మంది ఉన్నారంది. అయినా కథానాయకిగా తన పయనం విజయవంతంగా సాగడానికి కారణం కథల ఎంపికనేనని చెప్పింది. దర్శకుడు కథ చెబుతున్నప్పుడే అందులో కథా పాత్రగా తాను మారిపోతానని చెప్పింది. ఈ కథలో తాను నటించగలనా? తాను అందులో నప్పుతానా? ప్రేక్షకులు ఆ పాత్రలో అంగీకరిస్తారా లాంటి ప్రశ్నలను తనకు తానే వేసుకుని ఆ తరువాతనే అందులో నటించడానికి సమ్మతిస్తానని చెప్పింది.

అయితే ఇంతకు ముందు కథల ఎంపికలో తానూ తప్పులు చేశానని, ఆ అనుభవాలను మరచిపోనని చెప్పింది. చేసిన తప్పుల నుంచి ఎదురైన గుణ పాఠాలతో పాటు, ఇతరులను గమనిస్తూ వారి నుంచి చాలా నేర్చుకున్నానని పేర్కొంది. ఇవే తన విజయ రహస్యాలని నటి సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు చిత్రాలపైనే దృష్టి సారించినట్లుంది. తమిళంలో ఇరుంబుతిరై, సూపర్‌డీలక్స్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించినా ఇప్పుడు ఇక్కడ ఒక్క చిత్రం కూడా చేతిలో లేదు. మరి తమిళ చిత్రాల అవకాశాలను ఈ అమ్మడే ఒప్పుకోవడం లేదా, లేక కోలీవుడ్‌నే దూరంగా పెట్టిందా అన్న చర్చ మాత్రం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!