కథానాయికలే కష్టపడుతున్నారు!

8 Sep, 2019 09:40 IST|Sakshi

తను అనుకున్నది నిర్భయంగా చెప్పే అతికొద్ది మంది హీరోయిన్లలో నటి సమంత ఒకరు. నటిగా సక్సెస్‌ అవడమే కాదు, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలోనూ విజయం సాధించిన నటి సమంత. నటుడు నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అటు సంసార జీవితాన్ని, ఇటు నట జీవితాన్ని సంతోషంగా గడిపేస్తున్న సామ్‌ ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి విదేశీ విహార యాత్రకు వెళ్లింది. అక్కడు ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది.

ఆ గ్లామరస్‌ ఫొటోలను చూసిన ఒక వర్గం విమర్శలు చేసినా, యూత్‌ మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అలా మరోసారి వార్తల్లో నానుతున్న సమంత ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సంసార జీవితంలో ఏ విషయంలోనైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కల్పించారని చెప్పింది. వరుసగా సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటిస్తున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. నిజంగానే వరుసగా విజయాలను అందుకోవడం సంతోషంగా ఉందని, తన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపింది.

అందంగా ఉన్నంత మాత్రాన సినీ రంగంలో స్థానాన్ని పదిలం చేసుకోవచ్చుననే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పింది సమంత. మరో విషయం ఏమిటంటే  కథానాయకుల కంటే కథానాయికలే ఎక్కువగా కష్టపడుతున్నారని పేర్కొంది. అదేవిధంగా సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించడం వల్ల తన విజయరహస్యం తెలిసిపోయిందని భావించరాదని... దాన్ని తెలుసుకోవడం ఎవరి వల్లా సాధ్యంకాదని అంది. ఇకపోతే తాను దర్శకత్వం వహించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పింది.

అయితే భవిష్యత్‌లో నిర్మాతగా మారి మహిళలకు ప్రాముఖ్యత కలిగిన మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న ఆశ ఉందని అందుకే కచ్చితంగా నిర్మాతగా మారతానని చెప్పింది. ఈ తరం మహిళలు స్వతంత్రంగా జీవిస్తున్నారని పేర్కొంది. సమంత నటనకు విరామం ఇవ్వనుంది, పిల్లలను కనాలని నిర్ణయించుకుంది లాంటి వదంతులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. అవన్నీ ఒట్టి వదంతులే కొట్టిపారేసింది సామ్‌. ప్రస్తుతం ఈ అమ్మడు 96 తమిళ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. అదే విధంగా ఒక వెబ్‌ సిరీస్‌లోనూ నటించడానికి పచ్చజెండా ఊపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ ఆశ ఉంది కానీ..!

నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

నయా లుక్‌

రాజకీయ రాణి

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

విలన్‌గా హాట్ బ్యూటీ!

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్‌ లుక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా