ఆ మూవీ సూపర్.. సమంత ట్వీట్

27 Aug, 2017 18:52 IST|Sakshi
ఆ మూవీ సూపర్.. సమంత ట్వీట్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ అర్జున్ రెడ్డి. ట్రైలర్ తో పాటు వివాదాలతోనూ భారీ పబ్లిసిటీ పొందిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీపై స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో స్పందించారు. మూవీ చాలా బాగుందని తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ‘చాలా రోజుల తర్వాత నేను ఓ వాస్తవికత ఉన్న మూవీ చూశాను. అర్జున్ రెడ్డి మూవీ యూనిట్ ఔట్ స్టాండింగ్ గా ఉంది. టాలీవుడ్ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చేశాయ్’ అంటూ నటి సమంత హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ అర్జున్ రెడ్డి భారీ కలెక్షన్లు సాధిస్తోంది. తొలి రోజు 4.6 లక్షల డాలర్లు వసూళు చేసిన ఈ మూవీ రెండో రోజు 2.8 లక్షల డాలర్లు రాబట్టింది. ఇలాగే వసూళ్లు సాధిస్తే తొలి వారాంతానికి మిలియన్ మార్క్ ను ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ గా అర్జున్ రెడ్డి నిలవనుంది.