ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్‌

4 Nov, 2019 12:34 IST|Sakshi

అర్జున్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌,  కృతీసనన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం పానిపట్‌. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా ఈ చ్రితం రూపొందుతుంది. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ అహ్మద్‌ సా అబ్దాలీ పాత్రలోనటిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం సంజయ్‌ దత్‌ లుక్‌ను విడుదల చేసింది. ఆ లుక్‌ను చూసిన అభిమానులు.. అబ్దాలీ పాత్రలో ఆయన ఒదిగిపోయాడని అంటున్నారు. కొందరు నెటిజన్లు సంజయ్‌ దత్‌ కాస్టూమ్స్‌ అచ్చం కట్టప్పలా ఉన్నాయని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. డిసెంబర్‌ 6న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు.  

అలాగే కృతీసనన్‌ కూడా తన ప్రాతకు సంబంధించిన లుక్‌ను ట్విట్‌లో షేర్‌ చేశారు. ఈ చిత్రంలో అవకాశం దక్కడంపై కృతీసనన్‌ ఇటీవల మాట్లాడుతూ.. ‘ ఇది ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన చాలా గొప్ప కథ. ఇందులో పార్వతి బాయి పాత్ర చాలా బాగా నచ్చింది. డైరెక్టర్‌ ఆ పాత్రను మలచిన తీరు అద్భుతం. నేను ఆ పాత్రకు సరిపోతానా లేదా అనుకున్నాను. కానీ గొప్ప దర్శకుడితో పిరియాడిక్‌ డ్రామాలో నటించే అవకాశం రావడంతో దాన్ని  వదులు కోవాలని అనుకోలేదు. కానీ డైరెక్టర్‌ నేను పంజాబీ అమ్మాయిని అయినప్పటికీ.. మరాఠి అమ్మాయిలాగా చాలా బాగా చూపించారు. ఇది చాలా కష్టమైన పాత్ర.. అలాగే సవాలుతో కూడుకున్నద’ని తెలిపారు.  

కాగా, ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవారికర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్‌ కపూర్‌ మరాఠా నాయకుడు సదాశివరావ్‌ బాహు పాత్రలో,  కృతీసనన్‌ పార్వతి బాయి పాత్రలో నటిస్తున్నారు. అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తగా నిర్మిస్తున్నాయి. అజయ్‌-అతుల్‌లు సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా