‘సరిలేరు నీకెవ్వరు’ తొలిరోజు కలెక్షన్స్

12 Jan, 2020 20:48 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం (జనవరి 11న) విడుదలైన సంగతి తెలిసిందే.  రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్‌ సాధించినట్టు చిత్రబృందం ప్రకటించింది.

(చదవండి : సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ)

నైజాంలో రూ. 8.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.4 కోట్లు, కృష్ణాలో రూ. 3.07 కోట్లు, గుంటూరులో రూ. 5.15 కోట్లు, తూర్పుగోదావరిలో రూ. 3.35 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ. 2.72 కోట్లు, నెల్లూరులో రూ. 1.27 కోట్ల షేర్ వసూలైనట్టు  సినీ పీఆర్వో  బీఏ రాజు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  అంతేకాదు విదేశాల్లో సైతం ఈ సినిమా దద్దరిల్లిపోతుందట. మొత్తంగా చూసుకుంటే తొలిరోజే ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డు స్థాయిలో వసూలు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు సమర్పణలో మహేశ్‌, అనిల్‌ సుంకరలు నిర్మించారు. విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత, కౌముది తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు