-

Anil Kapoor: తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చా.. మళ్లీ మీ ముందుకు వస్తున్నా: అనిల్‌ కపూర్‌

28 Nov, 2023 08:18 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ట్రైలర్‌ను యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై ‍అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అనిల్‌ కూపూర్‌ మాట్లాడుతూ..' అందరూ బాగున్నారా? ట్రైలర్ చూశారా? నచ్చిందా? మీకు ఓ విషయం చెప్పాలి. ఒక నటుడిగా నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమానే. నాకు  మొదటి చిత్రం తెలుగులోనే. 1980లో వంశవృక్షం చిత్రంలో నటించా. డైరెక్టర్ బాపు నన్ను హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. దాదాపు 43 ఏళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నా. ఇది ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తోంది. సందీప్ వంగా బ్రిలియంట్ డైరెక్టర్. ఇది నా రెండో తెలుగు చిత్రం. మహేశ్ బాబుతో నాకు కుటుంబంలాంటి అనుబంధం. మీరు  ఒక ఫ్యామిలీ మ్యాన్. ది గ్రేటెస్ట్, గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి సార్. మన సినిమా ఇండస్ట్రీలోని ప్రపంచానికి పరిచయం చేశారంటూ ' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్‌ 1న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

మరిన్ని వార్తలు