‘తూనీగ’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

23 Aug, 2019 14:36 IST|Sakshi

హైదరాబాద్ : తూనీగ చిత్రం ఫ‌స్ట్ లుక్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు స‌తీశ్ వేగేశ్న ఫేస్‌బుక్ ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతా కొత్త‌వారే క‌లిసి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ద‌ర్శ‌కుడు ప్రేమ్ సుప్రీమ్ మ‌రిన్ని మంచి చిత్రాల రూప‌క‌ర్త‌గా పేరు తెచ్చుకోవాల‌న్నారు. ఈ చిత్ర ప్ర‌చార సార‌థి, వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ర‌త్నకిశోర్ శంభుమ‌హంతితో ఆత్మీయ అనుబంధం ఉంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే విడుద‌ల‌యిన ట్రైల‌ర్, డిజిట‌ల్ పోస్ట‌ర్స్ త‌న‌నెంతో ఆక‌ట్టుకున్నాయ‌ని, కొత్త వారికి బాస‌ట‌గా నిలిచేందుకు తానెన్న‌డూ సిద్ధ‌మేన‌న్నారు. ఇతిహాస ఆధారిత క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టు కుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీమ్ మాట్లాడుతూ.. నిర్మాణాంత‌ర ప‌నులు సైతం శ‌ర‌వేగంగా జ‌రు గుతున్నాయని అన్నారు. చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌యిన సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడికి శ్రీ‌కాకుళం ఫిల్మ్ క్ల‌బ్ నిర్వాహ‌కులు ర‌మేశ్ నారాయ‌ణ్, శ్రీ‌కాకుళం జిల్లా ఫొటోగ్ర‌ఫ‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ మెట్ట నాగ‌రాజు శుభాకాంక్ష‌లు తెలిపారు. వినీత్, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు సంగీతం సిద్ధార్థ్ స‌దాశివుని అందించారు.

మరిన్ని వార్తలు