స్క్రీన్‌ టెస్ట్‌

22 Aug, 2017 01:47 IST|Sakshi
స్క్రీన్‌ టెస్ట్‌

► అల్లు అర్జున్‌ డ్యాన్సర్‌గా కనిపించిన చిరంజీవి సినిమా
ఎ) విజేత  బి) శంకర్‌దాదా ఎంబీబీఎస్‌  సి) శంకర్‌దాదా జిందాబాద్‌  డి) డాడీ

► మనం రెగ్యులర్‌గా చూసే సినిమా ఏ ఫార్మట్‌లో ఉంటుందో తెలుసా?
ఎ) 4డి  బి) 2డి      సి) 5డి డి) 3డి

► ‘లడ్డూబాబు’ సినిమాలో ఇలా లావుగా కనిపించడం కోసం  ‘అల్లరి’ నరేశ్‌ వేసుకున్న మేకప్‌ పేరేంటి?
 ఎ) ప్రోస్థటిక్‌  బి) ఈస్థటిక్‌ సి) ఫెంటాస్టిక్‌ డి) లిప్‌స్టిక్‌

4 ‘తెలుగు భాష తియ్యదనం... తెలుగు భాష గొప్పతనం...’ పాట రచయిత?
ఎ) సుద్దాల అశోక్‌తేజ  బి) చంద్రబోస్‌ సి) రామజోగయ్య శాస్త్రి డి) అనంత శ్రీరామ్‌

► 5 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అతిథిగా నటించిన మోహన్‌బాబు ‘పెదరాయుడు’ దర్శకుడు ఎవరు?
ఎ) కె.రాఘవేంద్రరావు బి) కోదండరామిరెడ్డి సి) రవిరాజా పినిశెట్టిడి) బి.గోపాల్‌

► చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ‘ముగ్గురు మొనగాళ్లు’లో నటించిన ముగ్గురు హీరోయిన్లెవరు?
ఎ) రమ్యకృష్ణ, సౌందర్య, రంభ బి) రోజ, రమ్యకృష్ణ, నగ్మ సి) మీనా, టబు, దివ్యభారతి డి) రాధ, రాధిక, సుహాసిని

►  అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఏ హిట్‌ సినిమా పేరుతో రామ్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు?
ఎ) ప్రేమనగర్‌ బి) మిస్సమ్మ సి) మాయాబజార్‌ డి) దేవదాసు

►  ‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో’ పాట పాడిన గాయని ఎవరు?
ఎ) సునీత బి) శ్రీలేఖ     సి) ఉష డి) చిత్ర

►లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న కథానాయిక?
ఎ) రంభ బి) రమ్యకృష్ణ    సి) రోజా డి) విజయశాంతి

► చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ క్లైమాక్స్‌ ఫైట్‌ని కొరియోగ్రఫీ చేసిన ఫైట్‌మాస్టర్‌?
ఎ) విజయన్‌  బి) రామ్‌–లక్ష్మణ్‌ సి) పీటర్‌ హెయిన్స్‌  డి) కనల్‌ కణ్ణన్‌

►  అక్కినేని నాగార్జున,  నందమూరి హరికృష్ణ  అన్నదమ్ములుగా నటించిన చిత్రం?
ఎ) స్నేహమంటే ఇదేరా బి) ఎదురులేని మనిషి సి) సీతారామరాజు డి) నిన్నే ప్రేమిస్తా

► నాని ‘భలే భలే మగాడివోయ్‌’ కథను దర్శకుడు మారుతి ముందు ఈ హీరోకే చెప్పారు? అతనెవరో తెలుసా??
ఎ) అల్లు శిరీష్‌ బి) సుధీర్‌బాబు సి) ‘అల్లరి’ నరేశ్‌ డి) సునీల్‌

► పక్క ఫొటోలో చిరునవ్వులు చిందుస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీ హీరోయిన్‌. తనెవరో గుర్తుపట్టారా?
ఎ)  సమంత బి) రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సి) తమన్నా డి) త్రిష

► ‘అబ్బనీ తియ్యని దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరోయబ్బ’ సాంగ్‌ డ్యాన్స్‌ మాస్టర్‌?
ఎ) ప్రభుదేవా బి) లారెన్స్‌ సి) సుందరం మాస్టర్‌ డి) ప్రేమ్‌ రక్షిత్‌

► ఈ స్టిల్‌ ఏ సినిమా లోనిది?
ఎ) భీష్మ బి) భక్తప్రహ్లాద (1967) సి) లవకుశ డి) భక్తతుకారాం

►కన్నడ బ్యూటీ, ఇప్పటి స్టార్‌ హీరోయిన్‌ అనుష్కను టాలీవుడ్‌కి పరిచయం చేసిన దర్శకుడు?
ఎ) పూరి జగన్నాథ్‌ బి) సముద్ర సి) రాజమౌళిడి) సురేశ్‌ కృష్ణ

►‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో కాజల్‌ అగర్వాల్‌ చేసిన క్యారెక్టర్‌కు ఫస్ట్‌ ఈ హీరోయిన్‌నే అడిగారు. అయితే కాలేజీలో సెలవులు దొరక్క ఆమె చేయలేకపోయారు. ఇప్పటికీ ప్రభాస్‌తో సినిమా చేయలేకపోయిన ఆ హీరోయిన్‌ ఎరు?
ఎ) పూజా హెగ్డే  బి) హెబ్బా పటేల్‌  సి) రకుల్‌ప్రీత్‌ సింగ్‌డి) అనూ ఇమ్మాన్యుయేల్‌

►‘కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా’ డైలాగ్‌ రచయిత?
ఎ) చిన్నికృష్ణ బి) పరుచూరి బ్రదర్స్‌ సి) త్రివిక్రమ్‌ డి) పూరి జగన్నాథ్‌

► తమన్నా ఏ హీరో డెబ్యూ మూవీలో ఐటమ్‌ సాంగ్‌ చేశారు?
ఎ) రామ్‌    బి) రామ్‌చరణ్‌ సి) బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ డి) ప్రభాస్‌

► ‘గచ్చిబౌలి దివాకర్‌’గా నవ్వించిన కమెడియన్‌?
ఎ) బ్రహ్మానందం బి) అలీ  సి) ఎమ్మెస్‌ నారాయణ డి) ఎల్బీ శ్రీరామ్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) డి  2) బి  3) ఎ  4) బి 5) సి  6) బి  7) డి  8) డి9) డి  10) డి 
11) సి  12) డి  13) డి  14) సి  15) బి  16) ఎ  17) సి  18) బి 19) సి  20) ఎ.