కాళేశ్వరంపై ప్రజాభిప్రాయం | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై ప్రజాభిప్రాయం

Published Tue, Aug 22 2017 1:42 AM

కాళేశ్వరంపై ప్రజాభిప్రాయం - Sakshi

నేటి నుంచి 26 వరకు 15 జిల్లాల్లో కొనసాగనున్న ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్‌:
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యా వరణ అనుతుల్లో భాగంగా మంగళవారం నుంచి ఈ నెల 26 వరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) ప్రాజెక్టు ముంపు ప్రభావిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఎంపిక చేసిన మండలాల పరిధిలోనిగ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరగనుంది.

మొత్తంగా 15 జిల్లాల్లో జరిగే ఈ కార్యక్రమంపై ఇప్పటికే సంబంధిత అధికారులను ప్రభుత్వం అప్ర మత్తం చేసింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల ప్రక్రియలో పర్యావరణప్రభావ మదింపు(ఈఐఏ), పర్యావరణ ప్రభావ నిర్వహణ ప్రణాళిక(ఈఎంపీ)ని తప్పనిసరి గా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ వివరాలను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు అందించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే భూసేకరణ అవసరమైన జిల్లాల్లో పీసీబీ ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది.

ప్రజాభిప్రాయ సేకరణ షెడ్యూలు
22–08–17:    రాజశ్రీ గార్డెన్స్, రేకుర్తి, కరీంగనర్‌; రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, నిజామాబాద్‌ టౌన్‌; బాలాజి ఫంక్షన్‌ హాల్, శామీర్‌పేట్, మేడ్చల్‌;సోమ రాధాకృష్ణ ఫంక్షన్‌ హాల్, రాయిగిరి, భువనగిరి
23–08–17: రెడ్డి ఫంక్షన్‌ హాల్, రాఘవపూర్, పెద్దపల్లి; మా ఫంక్షన్‌ హాల్, నారాయణఖేడ్, సంగారెడ్డి; లక్ష్మీదేవి గార్డెన్స్, దేవునిపల్లి, కామారెడ్డి; రాజరాజేశ్వరి కల్యాణ మండపం, చిట్యాల. నల్లగొండ.
24–08–17:    నరేందర్‌రెడ్డి గార్డెన్స్, మెట్‌పల్లి, జగిత్యాల; శ్రీసాయి బాలాజీ గార్డెన్స్, మెదక్‌; వైఎస్సార్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మల్‌.
26–08–17: వియోలా గార్డెన్స్, సిధ్దిపేట; తహశీల్దార్‌ ఆఫీస్, జైపూర్, మంచిర్యాల; రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకల పాఠశాల, గంభీరావ్‌పేట, సిరిసిల్ల; ఏఎస్‌ఆర్‌ గార్డెన్స్, కుందూర్‌ పల్లి, భూపాలపల్లి.

Advertisement
Advertisement