ఇంకో పోలీస్‌ కావలెను!

2 Nov, 2019 03:21 IST|Sakshi
కత్రినా కైఫ్‌

బాలీవుడ్‌లో ఓ లేడీ పోలీసాఫీసర్‌ కోసం నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేశారట నటుడు షారుక్‌ ఖాన్, దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో గత ఏడాది విడుదలైన ‘జీరో’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది. ఇప్పుడు షారుఖ్‌ –ఆనంద్‌ ఓ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. ఇది ఓ సౌత్‌ కొరియన్‌ సినిమాకు హిందీ రీమేక్‌ అట. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు లేడీ పోలీసాఫీసర్లు ఉంటారట. అందులో ఒక పోలీసాఫీసర్‌ పాత్ర కోసం కత్రినా కైఫ్‌ను ఎంపిక చేశారని బాలీవుడ్‌ టాక్‌. మరో లేడీ పోలీసాఫీసర్‌ కోసం హీరోయిన్ల జాబితాను పరిశీలిస్తున్నారట. విద్యాబాలన్‌ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఇంకా ఫైనలైజ్‌ కాలేదట. ప్రస్తుతం ‘సూర్యవన్షీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు కత్రీనాకైఫ్‌. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ హీరో.

మరిన్ని వార్తలు