లుంగీ డ్యాన్స్తో థ్రిల్ చేశాడు!

16 Oct, 2015 15:36 IST|Sakshi
లుంగీ డ్యాన్స్తో థ్రిల్ చేశాడు!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ను బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ ఎడిన్బర్గ్ ఘనంగా సత్కరించింది. ఆయన చేస్తున్న మానవతా సేవలకు గుర్తింపుగా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ జీవితపాఠాలను ఉద్వేగభరితంగా వివరించారు. అనంతరం వేదికపై తన పాపులర్ లుంగీ డ్యాన్స్తో విద్యార్థులను అలరించాడు. ఆ తర్వాత 'నేను మళ్లీ డాకర్ట్ అయ్యానోచ్' అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు.

షారుఖ్ ప్రసంగంలోని కొన్నిముఖ్యమైన అంశాలు

  • జీవితంలో 'సాధారణం' అంటూ ఏదీ లేదు. అదొక జీవం లేని పదం మాత్రమే. సంతోషకరమై, విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కొంత పిచ్చితనం (రొమాంటిక్ తరహాలో) కూడా అవసరమే. మీ వెర్రితనాన్ని ఎప్పుడు చంచలత్వంగా భావించకండి. బయటి ప్రపంచం నుంచి దాచిపెట్టకండి. ప్రపంచంలోని అందమైన వ్యక్తులు, సృజనకారులు, విప్లవాలు తీసుకొచ్చినవాళ్లు, ఆవిష్కరణలు చేసినవాళ్లు.. తమ నైజాన్ని, ప్రవృత్తిని స్వీకరించడం వల్లే వాటిని సాధించారు
  • గడబిడ కావడంలో తప్పేమీ లేదు. ప్రపంచం గురించిన స్పష్టత కావాలంటే గడబిడ పడటం కూడా ఒక మార్గమే.
  • కళాకారుడి కన్నా కళే ముఖ్యం. మీదైన కళతో మీకు అనుబంధం లేకపోవడమే వెనుకబాటు.  ముందుకుసాగండి.
  • మీరు సంపన్నులు కాకముందే తత్వవేత్తలు అవొద్దు.
  • మీరు చేస్తున్న పని మీలో 'జోష్'ను (ఉత్సాహాన్ని) నింపకపోతే దానిని మానేయండి


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా