‘జెర్సీ’ రీమేక్‌ కోసం భారీ రెమ్యునరేషన్‌!

14 Oct, 2019 12:32 IST|Sakshi

టాలీవుడ్‌ సెన్సేషన్‌ ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌తో సూపర్‌ హిట్‌ కొట్టిన బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ మరో సౌత్‌ రీమేక్‌కు సిద్ధమయ్యాడు. నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ మూవీ హిందీ వర్షన్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత ఈ ప్రాజెక్టును బీ-టౌన్ బడా ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహర్‌ రీమేక్‌ చేస్తాడని అంతా భావించారు. 

అయితే అమన్‌ గిల్‌తో కలిసి టాలీవుడ్‌ నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు సంయుక్తంగా హిందీ రీమేక్‌ను నిర్మించనున్నట్లు తాజా సమాచారం. అంతేకాదు జెర్సీ ఒరిజినల్‌ వర్షన్‌ను రూపొందించిన గౌతం దర్శకత్వంలోనే హిందీ సినిమా కూడా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో హిందీ జెర్సీని విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ‘కబీర్‌సింగ్‌’తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన షాహిద్‌ కపూర్‌ ఈ సినిమా కోసం దాదాపు రూ. 40 కోట్ల మేర రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్‌ చేసిన పాత్రను రష్మిక మండన్న పోషించనున్నారన్న వార్తలు వెలువడినా.. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు