దూకుడుగా కబీర్‌ సింగ్‌..5 రోజుల్లోనే 100 కోట్లు!

26 Jun, 2019 13:19 IST|Sakshi

షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్‌తో తొలి వారాంతంలో రూ .70 కోట్ల కలెక్షన్‌ సాధించటమే కాకుండా తొలి ఐదు రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌లోకి ప్రవేశించింది.

కబీర్ సింగ్ సినిమా మొత్తం కలెక్షన్‌ మంగళవారం నాటికి 104.90 కోట్లకు చేరుకుంది. దేశమంతటా 3123 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం సింగిల్ స్క్రీన్లతో పాటు మల్టీప్లెక్స్లలో సునామీలా దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్, ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నాల్గవ అతిపెద్ద హిందీ ఓపెనర్‌గా నిలిచింది.

కబీర్ సింగ్ భారీ విజయం సాధించడంతో షాహిద్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కియారా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఉన్న ఫోటోను పోస్ట్‌ చేశాడు. సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంటే ఇండియా టుడే సినీ విశ్లేషకురాలు అనన్య భట్టాచార్య మాత్రం ఈ చిత్రానికి 1.5స్టార్‌ రేటింగ్‌ మాత్రమే ఇచ్చారు. 

‘సినిమా నిడివి 154 నిమిషాలుండగా అందులో 120 నిమిషాలు కబీర్ తాగడం, కొకైన్ కొట్టడం, మార్ఫిన్‌ సూది వేసుకొవడం, ఇతరులను కొట్టడం, గర్ల్‌ఫ్రెండ్‌పై అరవడం మాత్రమే చేశాడు. మిగిలిన 34 నిమిషాలు అతనిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. చివరగా ఇది కేవలం సినిమా మాత్రమే, నిజ జీవితం కాదు’ అని సినిమా రివ్యూ ఇచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు