నైన్‌.. లక్కీ సైన్‌

4 May, 2018 00:25 IST|Sakshi
శివరాజ్‌ కుమార్‌

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ లక్‌ని నమ్ముతారు. అది కూడా అంకెల్లో వచ్చే అదృష్టాన్ని మాత్రమే. ఈ సూపర్‌ స్టార్‌ 9 అంకెను లక్కీగా ఫీల్‌ అవుతారట. ఫస్ట్‌ సినిమా ‘ఆనంద్‌‘ జూన్‌ 19న రిలీజ్‌ అయింది. 29 ఏళ్ల వయస్సులో పెళ్లి జరిగింది. అది కూడా మే 19న. ఇలా తనకు కలిసొచ్చిన అన్నింట్లో 9 ఉండే సరికి 9 అంకెను అదృష్టంగా భావించడం మొదలెట్టారట శివరాజ్‌ కుమార్‌. ప్రస్తుతం ఆయన ‘కవచ’ సినిమా చేస్తున్నారు. ఇది మలయాళంలో మోహన్‌లాల్‌ చేసిన ‘ఒప్పం’ సినిమాకు రీమేక్‌. విశేషం ఏంటంటే రీమేక్స్‌లో నటించను అని చెప్పిన ఆయన 15 ఏళ్ల తర్వాత రీమేక్‌ మూవీ చేయడం విశేషం.

మరిన్ని వార్తలు