‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

26 Jul, 2019 18:42 IST|Sakshi

‘ఆయన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు’ అందుకే ఈ సినిమాని, క్యారెక్టర్‌ను సీరియస్‌గా తీసుకున్నానని బాలీవుడ్‌ హీరో సిద్దార్థ మల్హోత్రా అన్నాడు. నేడు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా కెప్టన్‌ విక్రమ్‌ బత్రా త్యాగాన్ని గుర్తు చేస్తూ అతడు ట్వీట్‌ చేశాడు.  సిద్ధార్థ్‌ ప్రస్తుతం.. కెప్టెన్‌ ‘విక్రమ్‌ బాత్రా ’ బయోపిక్‌ ‘షేర్షా’లో నటిస్తున్న విషయం తెలిసిందే. పరమ వీరచక్ర బిరుదు గ్రహీత, కార్గిల్‌ వార్‌లో చురుగ్గా పాల్గొన్న ఆర్మీ ఆఫీసర్, కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా పాత్రలో నటించనున్నారు సిద్ధార్థ్‌. ఈ సందర్భంగా సిద్దార్థ్‌ మాట్లాడుతూ.. షేర్షాలో కెప్టెన్‌ పాత్రకు పూర్తి న్యాయం చేసి అమరవీరుల కుటుంబాలను సంతోష పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో కెప్టెన విక్రమ్‌ బాత్రా  పాకిస్తాన్‌ చొరబాటు దారుల నుంచి భారత భూభాగాలను రక్షించి.. దేశ సేవలో ఆయన ప్రాణాలు అర్పించారు. యుద్ధంలో ఆయన ధైర్యాన్ని చూసిన పాకిస్తాన్‌ ఆర్మీ ఆయనను షేర్షా (లయన్‌ కింగ్‌ ) అని పిలిచేదట.

ఈ నేపథ్యంలో సిద్ధార్థ మాట్లాడుతూ ‘ఆయన కీర్తిని తెరపై చూపించాల్సిన భాధ్యత ఎంతో ఉంది. షేర్షా మూవీని కమర్షియల్‌ సినిమాలా కాకుండా బాత్రా  కీర్తిని ఇనుమడింపజేసేలా నిర్మించాలి అనుకుంటున్నాం’ అని పేర్కొన్నాడు. తాను విక్రమ్‌ బాత్రా  తల్లిదండ్రులను, సోదరుడిని కలిసినప్పుడు.. వాళ్లు కెప్టెన్‌ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. ‘షేర్షా పాత్రలో నటించడం అంత సులభమైన విషయం కాదని, దేశ రక్షణ బాధ్యత తన భుజాలపై ఉందని  కెప్టెన్‌ భావించేవారని సిద్ధార్థ్‌ అన్నాడు. కాగా  ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కరణ్‌  జోహార్‌ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విష్ణువర్థన్‌ దర్శకత్వం వహించనున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

‘డియర్‌ కామ్రేడ్‌‌’ మూవీ రివ్యూ

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

బీజేపీలోకి శుభసంకల్పం నటి..!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌

సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

లుంగీ కడతారా?

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌

పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

పసుపు-కుంకుమ స్టార్‌.. అలీ రెజా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!