‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

26 Jul, 2019 19:15 IST|Sakshi

న్యూఢిల్లీ: మ‌ర‌ణ‌శిక్ష ర‌ద్దుపై ఏకాభిప్రాయం తీసుకునే అవ‌స‌రం ఉందని.. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయం రావాల్సి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభలో మరణశిక్ష రద్దు కోరుతూ.. ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రదీప్‌ తమ్తా అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున.. కేవలం కేంద్రం నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రాలు కూడా అంగీకరించాలని తెలిపారు. కాగా ప్ర‌భుత్వం ఈ అంశాన్ని ప‌రిశీలిస్తోందని.. దీనిపై నివేదిక వ‌చ్చిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకుంటుందన్నారు. మ‌ర‌ణ‌ దండ‌న విధించాల‌నేది తమ అభిప్రాయం కాదంటూ.. దోషుల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్‌ చేస్తున్నారని గుర్తు చేశారు.

నిర్భ‌య ఘ‌ట‌న స‌మ‌యంలో దోషుల‌కు ఉరిశిక్ష విధించాల‌ని ప్రజలు కోరారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో పాటు మ‌ర‌ణ‌ శిక్ష‌ను ర‌ద్దు చేసే అధికారం రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్‌ల‌కు ఉందన్నారు. అసాధార‌ణ ప‌రిస్థితుల్లోనే మ‌ర‌ణ శిక్ష విధిస్తారని చెబుతూ.. ఈ బిల్లును ఉప‌సంహ‌రించుకోవాలని ప్రదీప్‌ తమ్తాను కోరారు. 

దీనిపై ప్రదీప్‌ తమ్తా స్పందిస్తూ మరణ శిక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ముందుకు వస్తున్నాయని అన్నారు. అన్ని రాష్ట్రాలతో ఈ అంశాన్ని కేంద్రం చర్చిస్తుందని మంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

కర్ణాటక సీఎంగా యెడియూరప్ప

ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్‌ జగన్‌

ఆ ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుంది: హైకోర్టు

ఆ మాట చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్‌ జగన్‌

అందుకే జ్యుడిషియల్‌ బిల్లు : అంబటి 

ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసం

అందుకే నర‍్సాపురం వచ్చా: నాగబాబు

‘సుబాబుల్ రైతులను ఆదుకుంటాం’

స్విస్‌ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

రైతులకు గిట్టుబాటు ధరల కోసమే ఈ బిల్లు

ఈ బిల్లు సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనం

యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్‌లైన్‌ ఫిక్స్‌

స్థానికులకు ఉద్యోగాలు.. టీడీపీ వ్యతిరేకమా?

‘మహానేత ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’

గూగుల్‌కు ఊహించని షాక్‌

మా వెనుకున్నది ఆయనే: రెబల్‌ ఎమ్మెల్యే

ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులు

రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాం: కన్నబాబు

‘కేసీఆర్‌ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చేస్తారు’

పార్లమెంట్‌లో గళమెత్తిన రాష్ట్ర ఎంపీలు

త్వరలో ఐటీ పాలసీ.. స్టార్టప్‌ కంపెనీలూ వస్తాయ్‌

టీఆర్‌ఎస్‌ అరాచకాలపై పోరాడతాం : బండి సంజయ్‌

‘దాణా కుంభకోణం కంటే పెద్ద స్కాం’

‘ఆ ఎంపీ తల నరికి పార్లమెంటుకు వేలాడదీయండి’

కావాలనే ఆ నగరాన్ని టీడీపీ అభివృద్ధి చేయలేదు

ట్రాలీలో ఓడను తెచ్చి ఊరేగించారు : జోగి రమేశ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!