నా పెళ్లికి చాలా టైముంది : హన్సిక

16 Jul, 2013 04:18 IST|Sakshi
నా పెళ్లికి చాలా టైముంది : హన్సిక
హన్సిక, శింబు పెళ్లంట. ప్రస్తుతం ఏ తమిళ చానల్‌ని చూసినా ఇదే గోల. ఒకేసారి శింబుతో రెండు చిత్రాల్లో నటించారు హన్సిక. ఈ రూమర్లు రావడానికి కారణం అదే అని స్వయంగా హన్సిక చెప్పినా... ఈ రూమర్ల హంగామా మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. వీటికి తోడు వీరిద్దరిపై మరో కొత్త గాసిప్ హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. 
 
 ‘శింబు నిజంగా హన్సికను ఇష్టపడితే... తనను కోడలిగా చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు’ అని సాక్షాత్తూ శింబు తండ్రి టి.రాజేందరే పలువురు సినీ ప్రముఖులతో అన్నారని ఈ కొత్త గాసిప్ సారాంశం. ఈ గాసిప్పుల హంగామా రాను రానూ శ్రుతి మించడంతో పాపం.. హన్సికకు మైకుల ముందుకు రాక తప్పలేదు. ‘‘శింబు నాకు మంచి ఫ్రెండ్. నేను ఇప్పటివరకూ చాలామంది హీరోలతో నటించాను.
 
 వారితో ఎంత క్లోజ్‌గా ఉన్నానో శింబుతో కూడా అలాగే ఉన్నాను. నా పెళ్లికి చాలా టైముంది. అది మా ఇంట్లోవారి ఇష్టాఇష్టాలపైనే ఆధారపడి ఉంది. ఈ గాసిప్పుల వల్ల నా దర్శక, నిర్మాతలు కంగారు పడే అవకాశం ఉంది కాబట్టే ఈ వివరణ ఇస్తున్నాను’’ అని తేల్చి చెప్పారు హన్సిక.