వారు నన్ను ఓ స్టార్‌లా చూడరు..

15 Apr, 2019 16:59 IST|Sakshi

ముంబై : తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనను ఎన్నడూ ఓ స్టార్‌గా చూడలేదని ప్రముఖ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కుమార్తె, బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా చెప్పారు. తన సన్నిహితులు తనను చూసే విధానం తాను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతి మూవీని తాను తన తొలి చిత్రంగానే భావించి కష్టపడతానని తెలిపారు. తాను తన పాత్రను ఆకళింపు చేసుకుని అందులోకి తనను తాను నిమగ్నమయ్యేలా కసరత్తు చేస్తానని సోనాక్షి వెల్లడించారు.

నిజజీవితంలో తల్లితండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు ఎవరూ తనను ఓ స్టార్‌గా చూడరని, వారికి తాను తమకు తెలిసిన సోనాగానే ఉంటానని చెప్పారు. తన చుట్టూ చేరిన వారు యస్‌ మేడమ్‌ అనడం వాస్తవం కాదని, తనను ప్రేమించే వారు అదే సమయంలో సద్విమర్శలు చేయడం సహజత్వమని సోనాక్షి సిన్హా అన్నారు. ఈ ఏడాది తొలి మూవీగా తాను నటిస్తున్న కళంక్‌ విడుదల కానుందని , మరో మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు