తరువాతి కథ ఏంటి..?

10 Feb, 2015 00:05 IST|Sakshi
తరువాతి కథ ఏంటి..?

‘7/జీ బృందావన కాలనీ’ ఫేం సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘తరువాతి కథ’. శ్రీ పద్మావతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్. పద్మజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభాకరన్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన  ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో దర్శకులు వి.వి. వినాయక్, బి. గోపాల్, భీమనేని శ్రీనివాసరావు  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రదర్శక, నిర్మాతలు నా దగ్గర చాలా సినిమాలకు పనిచేశారు. ఈ చిత్రానికి పనిచేసిన అందరి భవిష్యత్తు ఈ విజయంపై ఆధారపడి ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.  ఈ చిత్రంతో ప్రభాకరన్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నానని వీవీ వినాయక్ అన్నారు.