‘వాట్సప్’ తరహాలో ‘హమ్‌ఫ్యాన్స్’ దేశీ యాప్ రూపకల్పన | Sakshi
Sakshi News home page

‘వాట్సప్’ తరహాలో ‘హమ్‌ఫ్యాన్స్’ దేశీ యాప్ రూపకల్పన

Published Tue, Feb 10 2015 12:04 AM

'whatsup' along the lines of 'Hum Fans' Home app design

యాప్‌ను ఆవిష్కరించిన నటి సంజన

బెంగళూరు: బెంగళూరుకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల బృందం వాట్సప్ తరహాలోనే ‘హమ్‌ఫ్యాన్స్’ అనే దేశీ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ప్రముఖ శాండల్‌వుడ్ నటి సంజన సోమవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాప్ రూపకర్తల్లో ఒకరైన చాంద్ షా మాట్లాడుతూ...ప్రస్తుతం ప్రతి ఒక్కరూ నెట్‌లో చాటింగ్ కోసం విదేశాల్లో రూపొందించబడిన అప్లికేషన్‌లనే ఆశ్రయిస్తున్నారని తెలిపారు.

అందుకే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో భారత్‌లో తయారైన అప్లికేషన్‌కు సైతం స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యాప్‌ను రూపొందించామని చెప్పారు. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ ఫోన్‌ల వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుందని, ఈ యాప్ ద్వారా చాటింగ్, వాయ్స్ చాట్, వీడియో చాటింగ్‌లను సాగించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement