గిరి గీసుకోలేదు

9 Jun, 2019 00:47 IST|Sakshi
గిరి బాబు

అవును... గిరి బాబు దేనికీ గిరి గీసుకోలేదు. ఆయన పేరు గిరి బాబు అయినా...ఫలానా పాత్రలే చేయాలని ఎప్పుడూ గిరి గీసుకుని కూర్చోలేదు. గిరిలోనే ఉండిపోలేదు.  ఏ పాత్ర చేసినా న్యాయం చేశాడు. ఇన్నేళ్లు వచ్చినా... ఇంకా మనమడిని హీరోగా పెట్టి సినిమా తీస్తా అంటున్నాడు. సంతోషంగా ఉన్నాను... అందరినీ సంతోషంగా ఉంచుతాను... అంటున్న ఈ అజాత శత్రువుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

► 76 ఏళ్ల జీవితంలో నటుడిగా దాదాపు అర్ధశతాబ్దం పూర్తి చేసుకున్నారు. మీ తొలి అవకాశాన్ని గుర్తు చేసుకుంటారా?  
మేం నాటకాలు వేస్తున్న సమయంలో ‘ఫలానా సినిమాకి కొత్తవాళ్లు కావాలి’ అనే ప్రకటన చూసి, నా ఫోటోలు పంపించాను. అదృష్టం తలుపు తట్టిన రోజు అదే అని ఇప్పటికీ అనుకుంటాను. ఇండస్ట్రీలో నాకు గాడ్‌ ఫాదర్‌లేరు, ఎవరితోనూ పరిచయాలు లేవు. కాస్తో కూస్తో అందంగా ఉంటాను. కొంచెం నటన మీద అవగాహన ఉంది. ఆ నమ్మకంతో ఫొటోలు పంపించాను. కబురు పంపితే ఏదో మొండి ధైర్యంతో మద్రాసు వెళ్లాను. వాళ్లు స్క్రీన్‌ టెస్ట్‌ చేసి ‘మా సినిమాలో నువ్వే హీరో’ అన్నారు.

► హీరోగా చేయాలనే ఇండస్ట్రీలోకి వచ్చారా?
నేనే కాదు, ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారందరూ హీరోగానే చేయాలనుకుంటారు. నేను నాటకాలన్నీ హీరోగానే చేశాను. మద్రాసులో స్క్రీన్‌ టెస్ట్‌ చేసి, నువ్వే హీరో అన్నారు. అయితే నా మొదటి సినిమా ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ పూర్తి కాలేదు. ఆ తర్వాత ‘తప్పటడుగులు’ కమిట్‌ అయ్యాను. అదీ ఆగిపోయింది. మూడో సినిమా ‘స్వర్గానికి నిచ్చెనలు’ ఆరు రీళ్లు తీశాక ఆపేశారు. ఫైనల్లీ 1973లో ‘జగమే మాయ’ సినిమా ద్వారా హీరోగా ఫస్ట్‌ టైమ్‌ స్క్రీన్‌ మీద కనిపించాను.

► మూడు సినిమాలు ఆగిపోతే ఎలా తట్టుకున్నారు?
తిరిగి ఇంటికి వెళ్లలేను. ఎందుకంటే అప్పటికే ఆ మూడు సినిమాల గురించి పేపర్‌లో ప్రకటన వచ్చింది. మా ఊళ్లో (రావినూతల) అందరికీ తెలిసిపోయింది. ఏమీ సాధించకుండా వెనక్కి తిరిగి వెళితే అవమానం. దాంతో మద్రాసులోనే ఆగిపోయాను. అప్పటికి నాకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. అమ్మానాన్న, భార్యాపిల్లలను ఊళ్లో వదిలిపెట్టి నేనొక్కడినే వెళ్లాను. చిన్న చిన్న పిల్లల్ని వదిలి ఉండటం అంటే చాలా బాధ అనిపించేది. అలాగని ఖాళీగా కూర్చోలేదు. నాటకాలు వేసేవాడిని. ఏంటిది? అంటూ చాలా వర్రీ అయ్యాను. అయితే 1973లో బ్రేక్‌ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసే పని లేకుండా అయిపోయింది.

► మూడు సినిమాలు ఆగినా ధైర్యం కూడదీసుకున్నారు. ప్రస్తుతం యువతకు అంత ఓపిక, ధైర్యం ఉండటం లేదు...
‘ఇది నా (వి)చిత్ర కథ’ అనే పుస్తకం’లో దీని గురించి మొత్తం రాశాను. ప్రయత్నించకుండా మానేయడం తప్పు. నిరాశతో జీవితాన్నే ముగించేయడం తప్పు. మనకెదురైన చేదు అనుభవాలు, గడ్డు పరిస్థితులను దాటాలి. సినిమాల్లో నిలదొక్కుకున్నాక ఎలా ఉండాలి?.. ఇలా ఆ పుస్తకంలో చాలా విషయాలు ప్రస్తావించాను. విజయానికి కావల్సిందే ఓపిక. నేను ఓపిక పట్టకుండా వెనక్కి వెళ్లిపోయి ఉంటే 600 సినిమాలు చేసి ఉండేవాడిని కాదు. నా ఫస్ట్‌ సినిమా ‘జగమే మాయ’ షూటింగ్‌ పూర్తికాక ముందే 7 సినిమాలు వచ్చాయి.

► 7 సినిమాల్లోనూ హీరోగానే చేశారా?
కాదు. ఒక రెండింట్లో హీరోగా చేశాను. మరో దాంట్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ఇంకో సినిమాలో విలన్‌గా చేశాను.

► హీరో అవాలని వచ్చారు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. మరి.. లైఫ్‌లో విజయం సాధించాననే అనుకుంటున్నారా?
డెఫినెట్‌గా సక్సెస్‌ అయ్యాను. హీరోగా చేశాను. కామెడీ, సీరియస్, జానపదాలు, విలన్‌గా అన్నీ చేశాను. ఇప్పటికీ తాత, తండ్రి వేషాలు వేస్తున్నాను. అన్ని రకాల జానర్లు, అన్ని రకాల పాత్రలు చేశాను. నేను నిర్మాతగా, దర్శకుడిగా చేసిన సినిమాలు కూడా సక్సెస్‌ అయ్యాయి. నటుడిగా నవరసాలు పోషించే అవకాశం వచ్చింది. హీరోగా చేసుంటే కొన్ని పాత్రలకే పరిమితం అయ్యుండేవాడినేమో. అన్ని రకాల పాత్రలు చేయగలగడం వల్ల పరిపూర్ణమైన నటుడు అనే సంతృప్తి ఉంది.

► 600 సినిమాలు.. 46 ఏళ్లుగా నటిస్తున్నారు. రెస్ట్‌ తీసుకోవాలని అనిపించడం లేదా?
  మా వృత్తే అది. ఇక వేరే పని తెలియుదు. సినిమాల్లో యాక్ట్‌ చేయడం, సినిమాలు తీయడమే పని. నేను రైతు బిడ్డని. వ్యవసాయం మీద మోజు ఉన్నా సరే ఈ వయసులో     చేయలేను. ఇప్పుడు మళ్లీ స్వగ్రామంలో వ్యవసాయం అంటే సాధ్యమయ్యే పని కూడా కాదు. వేరే వ్యాపారం చేయలేం. ఓపిక ఉన్నంత కాలం సినిమాలే. 46 ఏళ్లుగా సినిమాలకు అంకితమైపోయాను. రోజూ సెట్లో కూర్చుని అందరితో సరదాగా మాట్లాడటం, నటించడం చాలా సంతృప్తిగా ఉంటుంది. సడన్‌గా వేషాలు లేవంటే ఇంట్లో కూర్చుని టీవీలు చూసుకోవడం, పేపర్లు చదువుకోవడమే. సినిమాల్లో ఇంత కాలం నటించిన తర్వాత కచ్చితంగా కీర్తి కండూతి ఉంటుంది. ఒకవేళ సినిమాలు మానేస్తే ప్రజలు మరచిపోతారేమో అని భయం. ఎక్కడికెళ్లినా గుర్తు పట్టి ఆప్యాయమైన పలకరింపులు, ఫొటోలు అడగడాలు, చేసిన సినిమాల గురించి మాట్లాడడాలు... వీటికి అలవాటు పడిపోయి ఒక్కసారిగా ఇవన్నీ లేకపోతే? ఒక్క ఏడాది సినిమాలు చేయకపోయినా మరచిపోతారు. ఆ భయంతో ఇంకా సినిమాలు చేస్తున్నాను.(నవ్వు)

► చాలా ఫ్రాంక్‌గా చెప్పారు. అయితే ఈ వయసులో అంత టెన్షన్‌ అవసరమంటారా?
నాకు తెలిసి ఏ కళాకారుడూ మరుగున పడాలనుకోడు. అలవాటు పడిన తర్వాత అది లేకపోతే బతకలేరు. అది వాస్తవం. అందుకే టెన్షన్‌ తప్పదు.

► ఈ పాత్ర బాగా చేయలేదు అనుకున్న సందర్భాలు ఏమైనా? ఒకదశలో విలన్‌గా ఒకేరకమైన పాత్రలు చేశారు. మూసలో పడిపోయామనుకోలేదా?
బాగా చేయలేదని అనిపించలేదు. గిరిబాబు ఏ పాత్ర చేసినా న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడనే పేరుంది. నేను పనికొచ్చే ఆర్టిస్ట్‌ని. చెడగొట్టే నటుడిని కాదు. ఇక మూస గురించి చెప్పాలంటే.. ఆ ఆలోచనే రాలేదు. మనం సినిమాల్లో యాక్ట్‌ చేయాలి, డబ్బులు కావాలి, పేరు కావాలి. మనం చేయనంటే ఇంకొకరు చేస్తారు. గ్యాప్‌ ఇస్తే ఇంకొకరు దూరతారు. అప్పుడు మనకు విశ్రాంతి తప్పదు (నవ్వుతూ).

► మీ జీవిత భాగస్వామి శ్రీదేవిగారు మూడేళ్ల క్రితం వరకూ తోడూ నీడలా ఉన్నారు. ఆవిడ దూరమయ్యాక మీ జీవితంలో వచ్చిన మార్పు?
(చెమర్చిన కళ్లతో).. ఆ బాధ మాటలతో వర్ణించేది కాదు. సతీవియోగం అనేది, అందులో ఈ వయసులో ఈ ఎడబాటు గురించి చెప్పలేం. ఇది ఒకటీ రెండు రోజుల్లో తీరే బాధ కాదు. చెప్పుకుంటే తగ్గేది కాదు. నేను పోయేవరకూ ఆ బాధ వెంటాడుతూనే ఉంది.

► భర్త లేకపోయినా భార్య ఉండగలదని, భార్య లేని భర్త జీవితం దుర్భరమని అంటారు. నిజమేనా?
నిజమే. అయితే, భర్త పోయినా భార్య బాధపడదని కాదు. కాకపోతే తను ఉండగలదు. కానీ మగవాడి పరిస్థితి అలా కాదు. అతను భార్య మీద పూర్తిగా ఆధారపడిపోతాడు. మరి భార్య పోయాక ఎవరి మీద ఆధారపడాలి? కూతురి దగ్గర ఉండలేడు. కూతురు పరాయి అయిపోతుంది. కొడుకు దగ్గర అంటే కోడలు పిల్ల బాగా చూస్తే ఫర్వాలేదు. ఎవరో ఒకరి దగ్గర ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా బతకలేడు. మామూలు టార్చర్‌ కాదది.

► మీ భార్య పోయాక మీ నాన్నగారు కూడా చనిపోయారు. మామగారిని ఆవిడ బాగా చూసుకున్నారట. ఆ తర్వాత?
నాన్న చనిపోయి ఆర్నెల్లు అవుతోంది. నా భార్య మా నాన్నను బాగా చూసుకుంది. ఆవిడ  తర్వాత మా రెండో అబ్బాయి బోస్‌ వాళ్ల భార్య అంతే బాగా చూసుకుంది. అది నాకు సంతోషం.  

► మీ నాన్నగారినే బాగా చూసుకున్నారంటే మిమ్మల్ని కూడా మీ కోడళ్లు బాగానే చూసుకుంటారని ఊహించవచ్చు?
నిజమే. రఘుబాబు, బోస్‌బాబుకి మంచి సంబంధాలు చూసి చేశాను. కోడళ్లిద్దరూ చాలా మంచివాళ్లు. మా అమ్మాయి మాధవిది కూడా మంచి సంబంధమే. అల్లుడు మంచివాడు. మా ఇంటి పక్కనే వాళ్ల ఇల్లు. కుటుంబం పెద్దదయ్యాక ఇల్లు చాలడంలేదని రఘుబాబు మాదాపూర్‌లో కాపురం పెట్టాడు. ఇప్పుడు ఈ ఇంట్లో నేను, బోస్‌బాబు ఫ్యామిలీ ఉంటున్నాం.

► అప్పట్లో బోస్‌బాబుగారిని హీరోగా పెట్టి సినిమా చేశారు. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ కాలేదు?
‘ఇంద్రజిత్‌’ అనే సినిమాతో బోస్‌ని హీరోని చేశాను. నేను డైరెక్టర్‌ని. ఆ సినిమా బాగుందనిపించుకుంది. అయితే ఇండస్ట్రీలో కొందరు కావాలనే అన్‌ పాపులర్‌ చేశారు. హిట్‌ అయినా కాలేదని నెగటివ్‌ ప్రచారం చేశారు. అన్‌పాపులర్‌ చేయకపోయి ఉంటే వేరేలా ఉండేదేమో. కాంపిటీషన్‌ అనేది ఉంటుంది కదా. ఇలా చేయడం కామన్‌. ఏదైతేనేం బోస్‌ సినిమా కెరీర్‌ సాగలేదు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌ చేస్తున్నాడు. హ్యాపీగా ఉన్నాం.

► ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంది?
మార్నింగ్‌ 6.30కి లేస్తాను. బ్రష్‌ చేసి కాఫీ తాగుతూ పేపర్లన్నీ తిరగేస్తాను. తర్వాత స్నానం, టిఫిన్‌. పని ఉంటే బయటకు వెళ్తా. ఒంటిగంటకు భోజనం. తర్వాత కునుకు. సాయంత్రం వాకింగ్‌. 7 నుంచి 10 గంటల వరకూ టీవీ చూస్తాను. స్కూల్‌ డేస్‌లో నేను స్పోర్ట్స్‌ పర్సన్‌ని. క్రికెట్, కబడ్డీ అంటే ఇష్టం. ఆ మ్యాచ్‌లు చూస్తా. 15–20 రోజులు ఖాళీ ఉంటే ఊరెళ్లిపోతా. పాత స్నేహితులంతా కలసి ఎంజాయ్‌ చేస్తాం. మా ఇల్లు అలానే ఉంది. దానిపక్కనే ఇంకో బిల్డింగ్‌ కట్టాం. పండగకి వెళ్తే 20 రోజులు ఉండాల్సిందే. ఇంతకు ముందు మే 1 నుంచి జూన్‌ 15 వరకూ ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్లం. అదే మా కొడైకెనాల్‌.

► డబ్బు విషయంలో ఎలా ఉంటారు?
పెద్ద చేయే. నా కొడుకుది, కూతురిది, ఆఖరికి మా కోడళ్లది కూడా పెద్దచెయ్యే. ఏ ఫంక్షన్‌ అయినా విపరీతంగా ఖర్చు పెడతాం. మితిమీరి ఎప్పుడూ చేయలేదు. మా అమ్మాయికి ఒక కొడుకు, కూతురు. మనవడి పెళ్లయింది. అమెరికాలో ఉంటాడు. మనవరాలి పెళ్లి కూడా చేసేశాం. రఘుకి అమ్మాయి. బోస్‌కి అబ్బాయి. ఇంజనీరింగ్‌ చేశాడు. బోస్‌ కొడుకు నాగరత్న బాబు హీరోగా నా దర్శకత్వంలో వచ్చే ఏడాది ఓ సినిమా ప్లాన్‌ చేశాం.

► ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు సినిమా తీయగలను అనుకుంటున్నారా?
సినిమా అంటే... మంచి కథ ఉండాలి.  యాక్షన్‌ ఉండాలి. అలాగే సెంటిమెంట్‌ కూడా ఉండాలి. ఈ రెండూ సరిగ్గా కలిస్తే ఎప్పుడూ హిట్టే. డెఫినెట్‌గా హిట్‌ చేస్తాను.

► స్పోర్ట్స్‌ ఇష్టమన్నారు. వరల్డ్‌ కప్‌ ఫాలో అవుతున్నారా?
మొన్న గెలిచాం కదా... ఫైనల్‌ వరకూ వెళ్లాలని కోరుకుందాం.

► మీకు తీరని కోరికలు ఏమైనా?
అలాంటివేం లేవు. అన్నీ సక్రమంగా జరిగాయి. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం.

► బర్త్‌డే ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటారు?
ప్రతి సంవత్సరం ఊర్లోనే. ఊర్లో 500 మంది వరకూ భోజనం ఏర్పాటు చేస్తాను. అందరికీ అక్కడే సినిమాలు వేసి చూపిస్తుంటాను. ఆ సందడే వేరు. ఈసారి షూటింగ్‌ ఉంది. ‘డిస్కో రాజా’లో యాక్ట్‌ చేస్తున్నాను. అందుకని ఊరెళ్లలేదు. తర్వాత వీలు చూసుకుని వెళతాను.

► గతంలో ఎన్నికలప్పుడు చురుగ్గా పాల్గొన్నారు. మీకు రాజకీయాలంటే ఆసక్తి ఉందేమో?
అప్పట్లో ప్రజాసేవ కోసం ఎన్టీఆర్‌గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మేం అందులో చేరి ప్రచారం చేశాం. ఆయన బంపర్‌ మెజారిటీతో గెలిచారు. తర్వాత కొన్ని కారణాల వల్ల  మేం పార్టీ నుంచి బయటకు వచ్చేశాం. 2004లో అంతటి గొప్ప సంస్కర్త, ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం కలిగించిన నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిగారు. ఆయన్ని కలిశాను. 2009లో ఆయన కోసం ప్రచారం చేశాను. బంపర్‌ మెజార్టీతో గెలిచారు. ఆయన గతించిన తర్వాత ఆయన తనయుడు జగన్‌ పార్టీ స్థాపించాడు. ఆ పార్టీకి ప్రచారం చేశాను. దురదృష్టవశాత్తూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఆ ఐదేళ్లు ప్రజలను ఇబ్బందులు పెట్టాడు.

జగన్‌ పాదయాత్ర చేసి, జనాల కష్టాలను తెలుసుకున్నాడు. రెండేళ్ల క్రితమే డిసైడ్‌ అయిపోయింది జగన్‌ సీఎం అవుతాడని. చెప్పినవన్నీ అద్భుతంగా నెరవేరుస్తాడు. ఎన్నికల ముందే టీడీపీకి 20 సీట్లకి మించి రావని చెప్పా. జగన్‌ పరిపాలన దేవుడి పరిపాలనలా ఉంటుంది. సీఎం అయి పది రోజులు కూడా కాకముందే హృదయాల్ని దోచుకుంటున్నాడు. అభివృద్ధి సాధిస్తాడు. కేంద్రంతోనూ సామరస్యంగా ఉండి, నిధులు తెస్తాడు. తెలంగాణతోనూ మంచి సంబంధాలున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొడవలు లేకుండా నడిపిస్తారు.

కుమారులు రఘుబాబు, బోసుబాబులతో...

– డి.జి.భవాని

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!