కథగా..కల్పనగా తరలిపోయిన తారకు నివాళి!

26 Feb, 2018 09:32 IST|Sakshi

సాక్షి, ముంబై: అభిమాన అందాల నటి శ్రీదేవి ఇకలేరన్న (ఫిబ్రవరి 24)  పిడుగులాంటి వార్తతో  యావత్తు సినీ  జగత్తు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.  దీంతో ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ఆమె అభిమానులు తీరని విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రపంచంలో ధృవతారలా వెలిగిన మెగాస్టార్‌ శ్రీదేవి హఠాన్మరణంపై  పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు  ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన కళాకారులు, కార్టూనిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఆమె మరణం పట్ల అంతులేని ఆవేదన ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా  ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌  ఒడిషాలోని పూరీ బీచ్‌లో ఆర్‌ఐపీ  శ్రీదేవి అంటూ సైకత శిల్పంతో ప్రత్యేక నివాళులర్పించారు

ప్రఖ్యాత సంపాదకీయ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య కూడా భావోద్వేగాన్ని తన ఆర్ట్‌ ద్వారా ప్రకటించారు. దేవుని ఒడిలో  శ్రీదేవి నిద్రపోతున్నట్టుగా ఒక స్కెచ్‌ను వేశారు.  'రా రె రారామ్, ఓ రా రీ రమ్' (సద్మా, తెలుగులో వసంతకోకిల మూవీలోని పాట)  రూపొందించిన  కార్టూన్‌ ఆమె అభిమానుల్లో కంట నీరు పెట్టిస్తోంది.
 
కాగా  సమీప బంధువు వివాహ వేడుక కోసం దుబాయ్‌ వెళ్లిని  శ్రీదేవి తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.  తాజా సమాచారం ప్రకారం  సోమవారం ముంబై జుహూలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు  రిలయన్స్‌ క్యాపిటల్‌ అధినేత అనిల్‌ అంబానీకి చెందిన ప్రత్యేక విమానంలో శ్రీదేవి  భౌతికకాయం ముంబైలోని ఆమె నివాసానికి చేరనుంది.

 

మరిన్ని వార్తలు