చిరు చాన్సిచ్చాడు..!

16 Apr, 2019 10:15 IST|Sakshi

కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్‌ తరువాత హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఒకటి రెండు సినిమాలు పరవాలేదనిపించినా తరువాత హీరోగా కెరీర్‌ ముందుకు సాగలేదు. దీంతో తిరిగి కమెడియన్‌ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవల అరవింద సమేత, చిత్రలహరి లాంటి సినిమాలతో హాస్యనటుడిగా తిరిగి ఫాంలోకి వచ్చాడు.

తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో సునీల్‌కు చాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.

చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150లోనే సునీల్‌కు చాన్స్‌ ఇచ్చాడు చిరు. కానీ అప్పట్లో సునీల్ హీరోగా బిజీగా ఉండటంతో ఆ సినిమాలో నటించలేకపోయాడు. అందుకే కొరటాల శివ సినిమాలో ఆఫర్‌ రాగానే వెంటనే ఒప్పేసుకున్నాడట. దీంతో పాటు త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ సునీల్ నటించనున్నాడు.

మరిన్ని వార్తలు