హీరో చాలెంజ్‌కు సై అన్న సన్నీ లియోన్‌!

4 Mar, 2016 09:52 IST|Sakshi
హీరో చాలెంజ్‌కు సై అన్న సన్నీ లియోన్‌!

ముంబై: బాలీవుడ్ హీరోయిన్‌ సన్నీ లియోన్‌ ఈ మధ్య ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తోటి నటులతో ఉత్సాహంగా చర్చలు కూడా జరుపుతోంది. తాజాగా హోరో-నిర్మాత ఉదయ్‌ చోప్రాతో వ్యాయామల గురించి ఈ అమ్మడు చర్చించింది. ఈ సందర్భంగా ఉదయ్‌ సన్నీకి ఓ సవాల్‌ విసిరాడు. తాను జిమ్‌లో ప్లాంకింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తున్న ఫొటోలు పోస్టుచేసి.. నువ్వు కూడా ఇలా చేయగలవా అంటూ చాలెంజ్‌ చేశాడు.

అంతకుముందు సన్నీ తన జిమ్‌ ట్రైనర్‌ ప్రశాంత్‌ తో ప్లాంక్ ఎక్స్‌ర్‌సైజ్‌ల గురించి చర్చించింది. 'ధూమ్‌-3' స్టార్‌ ఉదయ్‌ చోప్రా విసిరిన సవాల్‌ను సై అంటూ స్వీకరించిన సన్నీ.. అతి కష్టమైన ప్లాంక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తూ.. ఆ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ' ప్రశాంతతో కలిసి అతి కష్టమైన ప్లాంక్‌ ఎక్సర్‌సైజ్‌ ఒక నిమిషం పాటు చేశాను. దీనిని ప్రాక్టిస్ చేసేటప్పుడు ఫామ్‌ అనేది ముఖ్యం. మీరు మాత్రం ఇది ట్రై చేసి గాయాలపాలవ్వకండి. దీనిని చేయడం ఎంత కష్టమో రెండో ఫొటోలో చూడొచ్చు' అని పేర్కొంది.

దీంతో ఇటు  హీరో ఉదయ్ చోప్రా, అటు జిమ్ ట్రైనర్ ప్రశాంత్ సన్నీ లియోన్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. అంతేకాకుండా జిమ్‌లో ఓ రోజు ఇద్దరం కలిసి ప్లాంక్ ఎక్సర్‌సైజ్‌ పోటీ పెట్టుకుందామంటూ ఉదయ్‌.. సన్నీకి సూచించాడు. దీనికి సన్నీ స్పందిస్తూ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ పోటీ పెట్టుకుందామని, అయితే తనకు గెలుస్తానన్న నమ్మకం మాత్రం లేదని చెప్పుకొచ్చింది. రెండు మోచేతులు నేలపై ఆనించి బెలూన్‌పై బస్కీలు తీయడాన్ని ప్లాంక్‌ ఎక్సర్‌సైజ్‌ అంటారు.  


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా