మైండ్‌ గేమ్‌

10 Feb, 2018 00:34 IST|Sakshi
సోఫియా

‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్‌ మే పడిపోయానే’ వంటి చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికుమార్‌ చావలి. మైండ్‌ గేమ్‌ కాన్సెప్ట్‌తో తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘సూపర్‌ స్కెచ్‌’. నర్సింగ్, ఇంద్ర, సమీర్‌ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీలతో పాటు విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్‌ టోనీ (ఇంగ్లండ్‌) ప్రధాన పాత్రల్లో నటించారు.

యారో సినిమాస్‌ సమర్పణలో యు అండ్‌ ఐ ఫ్రెండ్స్‌ ఫిల్మ్‌ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బలరామ్‌ మక్కల ఈ సినిమా నిర్మించారు.రవికుమార్‌ చావలి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన చిత్రమిది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం  డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు వాళ్లతో పాటు విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్‌ టోని పాత్రలు కూడా మెప్పిస్తాయి. సురేందర్‌ రెడ్డి ఛాయాగ్రహణం కనువిందుగా ఉంటుంది.  కార్తీక్‌ కొడకండ్ల సంగీతం అలరిస్తుంది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు