సూర్య 24కు ప్రీక్వల్

12 May, 2016 14:02 IST|Sakshi
సూర్య 24కు ప్రీక్వల్

సూర్య హీరోగా, విలన్గానే కాక నిర్మాతగానూ మారి తెరకెక్కించిన భారీ చిత్రం 24. కాలంలో ప్రయాణించటం అనే కాన్సెప్ట్తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచిటాక్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సత్తా చాటి భారీ వసూళ్లను రాబడుతోంది. సూర్య కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమాకు ప్రీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్వయంగా వెల్లడించారు.

ఈ ప్రీక్వల్లో.., అసలు కాలంలో ప్రయాణించే వాచ్ తయారు చేయాలన్న ఆలోచన సైంటిస్ట్కు ఎందుకు వచ్చింది. ఆ వాచ్ గురించి ఆత్రేయ ఎలా తెలుసుకున్నాడు. దాన్ని సొంతం చేసుకోవాడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూపించనున్నారట. ఇప్పటికే స్క్రీప్ట్ కూడా రెడీగా ఉన్న ఈ ప్రీక్వల్ను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం వెల్లడించలేదు. విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తుండగా తరువాత మహేష్ బాబు హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి రెండు సినిమాల తరువాత 24 ప్రీక్వల్ సెట్స్ మీదకు వెళుతుందా..? లేక ముందే వెలుతుందా.? చూడాలి.