‘తికమక తాండ’ కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది: విక్రమ్‌ కె. కుమార్‌

5 Dec, 2023 16:25 IST|Sakshi

‘‘తికమక తాండ’ ట్రైలర్‌ చాలా ఆసక్తిగా ఉంది. వెంకట్‌ ఎంచుకున్న కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించింది. తనకు పెద్ద విజయం చేకూరాలి. అలాగే ఆరిస్టులు హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖా నిరోషాలకు మంచి పేరు రావాలి’’ అని దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ అన్నారు. హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖా నిరోషా హీరో హీరోయిన్లుగా వెంకట్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తికమక తాండ’.

తిరుపతి సత్యం సమర్పణలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని విక్రమ్‌ కె. కుమార్‌ రిలీజ్‌ చేశారు. ‘‘ఇప్పటికే విడుదల చేసిన ΄ాటలు, టీజర్‌కి మంచి స్పందన లభించింది. ఈ నెల 15న సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కెమెరా: హరికృష్ణన్‌.  

>
మరిన్ని వార్తలు