కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని.. విజయకాంత్‌ ఆరోగ్యంపై సూర్య కామెంట్‌

4 Dec, 2023 09:35 IST|Sakshi

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగానే సుమారు మూడేళ్లుగా ఆయన బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాల్లో పాల్గొనడం మానేశారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో  నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం నవంబర్ 23న జ్వరంతో అడ్మిట్ అయిన విజయకాంత్ ఆరోగ్యం బాగానే ఉందని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

కొంతకాలం తర్వాత ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలో, 'విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయితే, అతని పరిస్థితి గత 24 గంటల్లో నిలకడగా లేనందున, అతనికి పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము. అతను అవసరం ఇంకా 14 రోజులు హాస్పిటల్‌లో ఫాలో-అప్ చేయవలసి ఉంటుంది.' అని తెలియజేసారు. దీంతో విజయకాంత్ అభిమానులు, డీఎం కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆసుపత్రి యాజమాన్యం నివేదికపై ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. విజయకాంత్ త్వరగా కోలుకుంటారని ఆమె వాలంటీర్లకు హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు హల్ చల్ చేస్తున్న వేళ.. విజయకాంత్ ఆస్పత్రిలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఎవరూ అనవసర పుకార్లు ప్రచారం చేయవద్దని, ఆ పుకార్లను ఎవరూ నమ్మవద్దని, విజయకాంత్ త్వరగా కోలుకుని మిమ్మల్ని కలుస్తారని అన్నారు.

ఈ సందర్భంలో, నటుడు సూర్య కూడా విజయకాంత్ ఆరోగ్యం గురించి  అతని కుటుంబం ద్వారా అడిగి తెలుసుకున్నాడు. ఈ మేరకు విజయకాంత్‌ సతీమణికి  ఫోన్‌ చేసి పరామర్శించారు. అలాగే, నటుడు విజయకాంత్ త్వరగా కోలుకోవాలని సూర్య తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో 'సోదరుడు విజయకాంత్ పూర్తిగా కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆయన పూర్తిగా కోలుకుని మనందరి ముందుకు వస్తారు.' అని పోస్ట్ చేశారు. 1999లో నటుడు సూర్య నటించిన 'పెరియన్న' చిత్రంలో నటుడు విజయకాంత్ ప్రత్యేక పాత్ర పోషించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు