థియేటర్ల సంఘం వార్నింగ్‌

24 Dec, 2019 20:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: తమిళ చిత్రసీమకు రాష్ట్ర థియేటర్ల యాజమానుల సంఘం షాక్ ఇచ్చింది. తమను నష్టాల్లోకి నెడుతున్న సమస్యలను పరిష్కరించకుంటే ధియేటర్లు మూసివేస్తామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ వినోదపన్ను 8 శాతం వెంటనే రద్దు చేయాలని, పెద్ద చిత్రాల ద్వారా నష్టపోతే ఆ చిత్ర నటీనటులే భరించాలని డిమాండ్‌ చేసింది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను 100 రోజులకు ముందు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేయకూడదని సూచించింది. తమ డిమాండ్లు అంగీకరించపోతే మార్చి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మూసివేస్తామని ప్రకటించింది. థియేటర్ల యాజమానుల సంఘం డిమాండ్లపై తమిళ చిత్రసీమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాగా, ఇటీవల కాలంలో భారీ చిత్రాలు ఎక్కువగా పరాజయం పాలవడంతో థియేటర్‌ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరికి ఊరట కల్పించేందుకు బడా నిర్మాతలు ముందుకు రావడం లేదు. లాభాలు వచ్చినప్పుడు తమకు వాటా ఇవ్వడం లేదు కాబట్టి నష్టాల్లో వస్తే తామెందుకు ఎదురు డబ్బులు ఇవ్వాలని నిర్మాతలు వాదిస్తున్నారు. మరోవైపు సినిమా విడుదలయి వంద రోజులు కూడా కాకుండానే అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్, యూట్యూబ్‌ వంటి డిజిటల్‌ ఫ్లామ్‌పామ్‌లలో ప్రసారం చేసేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తిగా చూపించడం లేదు. ఈ నేపథ్యంలో తమిళ థియేటర్ల యాజమానుల సంఘం తాజా డిమాండ్లు చేసింది.

మరిన్ని వార్తలు