రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’

19 Sep, 2019 13:18 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా తెలుగు ట్రైలర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో విడుదల చేశారు. 3 నిమిషాల నివిడి ఉన్న ఈ ట్రైలర్‌ తమ అంచనాలకు తగినట్టుగా ఉండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గంభీరమైన స్వరంతో చిరంజీవి చెప్పిన డైలాగులు అభిమానులను ఉత్తేజితులను చేస్తున్నాయి. నరసింహారెడ్డి పాత్రలో చిరు ఒదిగిపోయారని ఫ్యాన్స్‌ ఖుషీగా ఉన్నారు.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో తెలుగు ట్రైలర్‌ను 24 గంటల్లోపే 5 కోట్ల మందిపైగా వీక్షించారు. 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. హిందీలో సుమారు 50 లక్షలు, తమిళంలో దాదాపు 9 లక్షలు, కన్నడంలో 6.7 లక్షలు, మలయాళంలో లక్షకుపైగా వీక్షణలు నమోదయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’లో చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషించారు. కోణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై హీరో రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మించగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్‌, రవికిషన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. (చదవండి: ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అరె అచ్చం అలాగే ఉన్నారే!!

ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ లీక్‌ చేసిన పునర్నవి

మళ్లీ వస్తున్న ఆండ్రియా

ప్రేమ సంబరాలు

సూఫీ సుజాత

రైతు పాత్రలో...

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

బిగ్‌బాస్‌: గొడవలు పెట్టడం ఎలా?

పెళ్లైన విషయం మర్చిపోయిన నటి

‘అతనొక యోగి.. అతనొక యోధుడు’

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

ఆదంత్యం నవ్వించేలా ‘మేడ్‌ ఇన్‌ చైనా’ ట్రైలర్‌

బిగ్‌బీ ! ఈ విషయం మీకు తెలియదా ?

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్‌ గర్ల్‌’

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

రావణుడిగా ప్రభాస్‌.. సీతగా దీపికా పదుకోన్‌!

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

ది బిగ్‌ బుల్‌

గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌

మనో విరాగి

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

జీవితం తలకిందులైంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’

అరె అచ్చం అలాగే ఉన్నారే!!

ఒకేరోజు ముగ్గురు సినీ తారల జన్మదినం

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌ లీక్‌ చేసిన పునర్నవి