దీపావళికి వస్తాం గురూ!

31 Oct, 2017 00:37 IST|Sakshi

యస్‌ గురూ... పర్‌ఫెక్ట్‌ స్కెచ్‌ రెడీ చేశారు సూర్య! సారీ... ఒక్క స్కెచ్‌ కాదు, రెండు రెడీ! రాబోయే ఏడాది సంక్రాంతి, దీపావళి పండగలు సూర్య అభిమాను లకు వెరీ వెరీ స్పెషల్‌! ఎందుకంటే... వచ్చే సంక్రాంతికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘తానా సేంద కూట్టమ్‌’ను విడుదల చేస్తున్నట్టు చెప్పారు కదా! సేమ్‌... సంక్రాంతి టైమ్‌లోనే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారు. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు (సూర్య కజిన్స్‌) నిర్మించనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రారంభించి, దీపావళికి విడుదల చేస్తామని ప్రకటించారు. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఫస్ట్‌ టైమ్‌ సూర్య, సెల్వ రాఘవన్‌ కాంబినేషన్‌ సెట్‌ కావడంతో ఈ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలను తగ్గట్టు డిఫరెంట్‌ స్క్రిప్ట్‌తో సినిమాను రూపొందిస్తామని నిర్మాతలు తెలిపారు.

మరిన్ని వార్తలు