హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌

27 Oct, 2023 05:42 IST|Sakshi

‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్‌లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు.

2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్‌ కాంబో రిపీట్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు