హీరో భార్య ఇంట్లో దొంగలుపడ్డారు

29 Nov, 2016 13:05 IST|Sakshi
హీరో భార్య ఇంట్లో దొంగలుపడ్డారు

ముంబై: బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌ రావు ఇంట్లో దొంగతనం జరిగింది. డైమండ్‌ నెక్లెస్‌, ఉంగరం సహా దాదాపు 80 లక్షల రూపాయల విలువైన నగలను దోచుకెళ్లారు. కిరణ్‌ రావు ఇటీవల ఈ విషయాన్ని గుర్తించింది. కిరణ్‌ రావు బంధువు ఫిర్యాదు మేరకు ఖర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నారు.

కిరణ్‌ రావుకు ముంబైలోని బాంద్రాలో ఓ ఇల్లు ఉంది. కాగా ఆమె తన భర్త ఆమిర్‌తో కలసి కార్టర్‌ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. బాంద్రా ఇంట్లో ఆమె బంధువులు ఉంటున్నారు. ఈ ఇంటి బెడ్రూంలో కిరణ్‌ దాచిన నగలు మాయమయ్యాయి.  ఆమె బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంట్లో పరిశీలించారు. ఇంట్లో పనిచేస్తున్న వారు నగలు కాజేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐదు రోజుల నుంచి ముగ్గురు పనిమనుషులను విచారిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి