యేసుక్రీస్తు జీవిత కథతో...

8 Sep, 2018 00:27 IST|Sakshi
జాన్‌బాబు, పీడీ రాజు

ఇప్పటి వరకూ యేసుక్రీస్తు జీవితకథతో చాలా సినిమాలొచ్చాయి. తాజాగా పీడీ రాజు యేసుక్రీస్తుగా నటించిన చిత్రం ‘తొలి కిరణం’. జె. జాన్‌బాబు దర్శకత్వంలో సువర్ణ క్రియేషన్స్‌ పతాకంపై బేబీ మేరీ విజయ సమర్పణలో రూపొందిన ఈ సినిమాని డిసెంబర్‌ 14న విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్‌ 7న జాన్‌బాబు జన్మదినం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జాన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని చాలా కష్టపడి నిర్మించాం.

ఇందులోని 45 నిమిషాల గ్రాఫిక్స్‌ హైలెట్‌గా ఉంటాయి. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. కష్టపడి నటించాం’’ అన్నారు íపీడీ రాజు. ‘‘ఈ సినిమా చాలా నేచురల్‌గా  ఉంది. ఇలాంటి  సినిమాలు మన తర్వాతి సమాజానికి చాలా అవసరం’’ అని నటుడు బెనర్జీ అన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్‌ సాగర్‌తో పాటు చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఆర్పీ పట్నాయక్‌.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త దర్శకుడితో?

వర్మ కాదు... ఆదిత్యవర్మ

హేమలతా లవణం

అంతా ఉత్తుత్తిదే

మిఠాయి బాగుంది 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమ్మర్‌లో షురూ

అంతా ఉత్తుత్తిదే

కాంబినేషన్‌ కుదిరింది

వేలానికి  శ్రీదేవి  చీర 

కొత్త దర్శకుడితో?

హేమలతా లవణం