దసరా రేస్‌

4 Sep, 2019 08:59 IST|Sakshi

పండక్కి నాలుగైదు సినిమాలు ఒకేసారి విడుదలైనా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను ఆశించవచ్చు. పండగ సెలవులు, ఫెస్టివల్‌ మూడ్‌ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అందుకే పండగకి మూడు నుంచి నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి దసరా రేస్‌లో నిలబడే సినిమాల లిస్ట్‌ ఒక్కోటిగా బయటికి వస్తోంది. ‘చాణక్య’గా వస్తున్నారు గోపీచంద్‌. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహరీన్, జరీన్‌ఖాన్‌ కథానాయికలుగా నటించారు. టాకీ పార్ట్‌ పూర్తయింది. ఇటీవలే ఇటలీలో పాటల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాకు అజయ్‌ సుంకర సహనిర్మాత. దసరా పండక్కి ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భయపెట్టనున్నారు దర్శకుడు ఓంకార్‌. ఆల్రెడీ ఆయన ‘రాజుగారి గది, రాజుగారి గది 2’ చిత్రాలతో అదే చేశారు.

ఈ సారి అంతకుమించి నవ్వించి భయపెట్టడానికి ‘రాజుగారి గది 3’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేశారు. అశ్విన్‌బాబు, అవికా గోర్‌ హీరోహీరోయిన్లుగా ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ విడుదల చేశారు. ఈ సినిమాకు సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ రాశారు. ఇక దసరా రేస్‌కి ఓ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ కూడా రెడీ అవుతోంది. కీర్తీ సురేశ్‌ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘మిస్‌ ఇండియా’ కూడా దసరాకే విడుదల అంటున్నారు. ‘వెంకీ మామ’ కూడా దసరాకు విడుదలవుతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరి.. దసరా రేస్‌లో నిలిచే చిత్రాలు ఏవో తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

‘అర్జున్‌ నీకు ఆ స్థాయి లేదు’

సాహోకు తిప్పలు తప్పవా..?

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

ఎవరా ‘చీప్‌ స్టార్‌’..?

‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’

రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్‌ డైరెక్టర్‌

‘పావలా కల్యాణ్‌’ అంటూ ట్వీట్ చేసిన హీరోయిన్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

నటుడిని చితక్కొట్టిన యువకుడు

నయన కంటే ఆమే బెస్ట్‌

పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!