Extraordinary Man Movie: ఈగోని పక్కన పెడితే ఆడియన్స్‌కి దగ్గరవుతాం

7 Dec, 2023 04:48 IST|Sakshi

– నితిన్‌

‘‘గ్లోబల్‌ స్థాయికి వెళ్లాలని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ సినిమాలను చేయలేదు. కథాబలం ఉండటంతో ఆ సినిమాలను జపాన్‌ వంటి ఇతర దేశాల ప్రేక్షకులూ ఆదరించారు. గ్లోబల్‌ అప్పీల్‌ ఉన్న కథ కోసం ఎదురు చూస్తూ ఉంటే టైమ్‌ వృథా అవుతుంది. నాకు వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ క్రమంలో పాన్‌ ఇండియా కథ ఏదైనా సెట్‌ అయితే ఓకే. అయినా నాకలాంటి పెద్ద పెద్ద ఆశలు లేవు. తెలుగులోనే సినిమాలు చేయాలని ఉంది’’ అని హీరో నితిన్‌ అన్నారు. నితిన్, శ్రీ లీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’ రేపు రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో నితిన్‌ చెప్పిన విశేషాలు.

► ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’లో నా పాత్రలో త్రీ షేడ్స్‌ ఉన్నాయి. కథ రీత్యా జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాను. అలా అని ఈ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్టుల కష్టాల గురించి చెప్పడం లేదు. ఆ పాత్ర నుంచి కామెడీ పండించాం. ‘ఎక్స్‌ట్రా’ చిత్రంలో ఇంట్రవెల్‌లో వచ్చే ట్విస్ట్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. కథ కొత్తది కాక΄ోవచ్చు కానీ పాయింట్‌ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కథ విన్నప్పుడల్లా హాయిగా నవ్వుకున్నాను. కథ స్క్రీన్‌ మీదకు వచ్చినప్పుడు కూడా సేమ్‌ ఫీలింగ్‌.
►వక్కంతం వంశీగారి కథలతో వచ్చిన ‘కిక్‌’, ‘రేసు గుర్రం’, ‘ఊసరవెల్లి’, ‘టెంపర్‌’ చిత్రాలను గమనిస్తే హీరో క్యారెక్టరైజేషన్‌ కొత్తగా, విభిన్నంగా ఉంటుంది. ‘ఎక్స్‌ట్రా’ చిత్రంలోనూ ఇలానే ఉంటుంది. స్క్రీన్‌ ప్లే కొత్తగా ఉంటుంది.
►సినిమాలో రావు రమేశ్‌గారు నాకు తండ్రిగా నటించారు. ఆయనకు, నాకు మధ్య వచ్చే సీన్స్‌  వినోదాత్మకంగా ఉంటాయి. కొంత సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. రాజశేఖర్‌గారు సెకండాఫ్‌లో వస్తారు. సందర్భానుసారంగా కామెడీ వస్తుంటుంది.
►సినిమాలో నేను జూనియర్‌ ఆర్టిస్టు్టను కాబట్టి ‘శ్రీమంతుడు’, ‘బాహుబలి’ వంటి సినిమాల ప్రస్తావనతో కాస్త కామెడీ ఉంటుంది. వినోదం కోసమే ఇలా చేశాం. ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో వెంకటేశ్‌గారి పాత్రపై ఇతర పాత్రధారులు జోక్స్‌ వేస్తుంటారు. ఇమేజ్, ఈగోల గురించి ఆలోచించకుండా పాత్ర కోసం నటిస్తే ఆడియన్స్‌కు మరింత దగ్గర కావొచ్చు. ఈ విషయంలో నాకు వెంకటేశ్‌గారు స్ఫూర్తి.
►ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్‌. అలాగే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాను. కథ నచ్చితే గ్రే షేడ్‌ (కాస్త నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలు) ఉన్న పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను.  

>
మరిన్ని వార్తలు