ఉదయ్‌కిరణ్ ఆఖరి కథ!

10 Jun, 2015 00:12 IST|Sakshi
ఉదయ్‌కిరణ్ ఆఖరి కథ!

 ‘చిత్రం’ సినిమాతో కథానాయకునిగా రంగప్రవేశం చేసిన ఉదయ్‌కిరణ్ నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన ప్రేమకథ’. ఉదయ్ నటించిన తొలి చిత్రం జూన్‌లోనే విడుదల కాగా, ఈ చివరి చిత్రం కూడా ఇదే నెలలోనే విడుదల కానుంది. ఈ నెల 26న ఉదయ్‌కిరణ్ జయంతి. ఆ సందర్భంగా ఉదయ్ అభిమానుల కోసం ‘చిత్రం చెప్పిన కథ’ను విడుదల చేయాలని ఆ చిత్రనిర్మాత మున్నా చాంద్‌గారి అనుకుంటున్నారు.

ఉదయ్ కిరణ్ హీరోగా డింపుల్, మదాలసా శర్మ, గరిమ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మోహన్ ఎ.యల్.ఆర్.కె. దర్శకుడు. మున్నా కాశీ పాటలు స్వరపరిచారు. నిర్మాతగా తన మొదటి సినిమా ఉదయ్ కిరణ్‌కి చివరి సినిమా అవుతుందనుకోలేదని మున్నా అన్నారు. ఆయన గతంలో ఉదయ్‌కి మేనేజర్‌గా వ్యవహరించేవారు. ఉదయ్ కిరణ్‌తో సినిమా చేసిన అనుభవాన్ని మర్చిపోలేనని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: అమరనేని నరేశ్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి