పైరసీపై చట్టం తీసుకొస్తాం: కిషన్‌రెడ్డి

23 May, 2020 14:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. శనివారం టాలీవుడ్‌ ప్రముఖులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌తో సహా దేశం నలువైపులా షూటింగ్‌లు చేసుకునేందుకు త్వరలోనే అనుమతులిస్తామన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా  థియేటర్లు ఒకేసారి ఓపెన్‌ అయ్యేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. 

అంతర్జాతీయ సినిమా పైరసీపై త్వరలోనే మీటింగ్‌ నిర్వహించి పైరసీపై కొత్త చట్టం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్‌ ఉండేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్మాత సురేష్‌ బాబు, డైరెక్టర్‌ తేజ, జెమినీ కిరణ్‌, త్రిపురనేని వరప్రసాద్‌, దాము, వివేక్‌ కూచిభొట్ల, అనిల్‌ శుక్ల, అభిషేక్‌ అగర్వాల్‌, శరత్‌, ప్రశాంత్‌, రవి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి:
నాగబాబు మరో సంచలన ట్వీట్‌: వైరల్‌
సినీనటి వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య

మరిన్ని వార్తలు