వాలంటైన్స్‌ డే స్పెషల్‌: సినిమా ముచ్చట్లు

14 Feb, 2020 17:37 IST|Sakshi

సినిమాలకు ప్రేమికుల రోజును మించిన ముహూర్తం ఉంటుందా? అందుకే ఈరోజు ఫస్ట్‌లుక్‌, కొత్త పాటలు, రిలీజ్‌లంటూ హోరెత్తిస్తారు. ఇక ఇప్పటికే వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ థియేటర్లలో సందడి చేస్తుండగా మరిన్ని సినిమాలు నేడు ప్రమోషన్లు చేపట్టాయి. పైగా ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కొత్త సరుకు వచ్చేసింది. ఈ సందర్భంగా ఫిల్మీ దునియాలో కొత్త ముచ్చట్లేంటో చూద్దాం..

‘నేను లేని నా ప్రేమకథ’... పేరే కాదు, సినిమా కూడా ఎంతో భిన్నంగా ఉంటుందని చెప్తోంది చిత్ర యూనిట్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, గాయత్రి ఆర్‌ సురేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రిష్‌ సిద్దిపల్లి, అదితిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వారి ప్రేమకథకు దగ్గరవుతారని నిర్మాత కళ్యాణ్‌ కందుకూరి పేర్కొన్నారు. మరి ఈ ఫీలింగ్‌ ప్రేక్షకులకు ఎంతమేరకు కనెక్ట్‌ అవుతుందో చూడాలి. నిర్మాత: కళ్యాణ్‌ కందుకూరి, దర్శకుడు: సురేష్‌, సంగీతం: జువిన్‌ సింగ్‌ (వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ రివ్యూ)

సింగర్‌ నోయెల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘14’. రతన్‌, విశాఖ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ ఆచార్య, మహేశ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ నేడు సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాడు. మోషన్‌ పోస్టర్‌లోని బీజీఎమ్‌ ఆకట్టుకుంటోంది. దర్శకుడు: లక్ష్మీ శ్రీనివాస్‌, నిర్మాత: సుబ్బారావ్‌ రాయన, శివకృష్ణ నిచ్చెన.

సురేష్‌ ప్రొడక్షన్స్‌లో రానా సమర్పణలో వస్తున్న సినిమా ‘కృష్ణ అండ్‌ హిస్‌ లీల’. ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేశ్‌ శుక్రవారం విడుదల చేశాడు. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలిని వడ్నికట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమికులు ఏం మాట్లాడుకుంటారో.. అబ్బాయిలు ఏ విధంగా అమ్మాయిలను పడేస్తారో టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ‘నా బతుకంతా నేను రాంగ్‌ టైమ్‌లోనే రిలేషన్‌షిప్‌లో ఉంటాను’ అన్న డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. ఈ ప్రేమకథ(ల) చిత్రం మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు: రవికాంత్‌ పెరెపు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

సాయిధరమ్‌తేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఉప్పెన. ఇందులో కన్నడ భామ కీర్తిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్రబృందం హీరోహీరోయిన్ల కొత్తలుక్‌లను విడుదల చేసింది. వెండితెరపై ఆశి, సంగీతలుగా అలరించనున్న వీరిరువురి లుక్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ‘ఉప్పెన’ ఏప్రిల్‌ 2న బాక్సాఫీస్‌ బరిలోకి దూకనుంది. దర్శకుడు: బుచ్చిబాబు సానా, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

► ‘ఓ.. పిట్టకథ: ఇట్స్‌ ఎ లాంగ్‌ స్టోరీ’ సినిమా నుంచి ‘ఏమైపోతానే’ పాట లిరికల్‌ వీడియో విడుదలైంది. బుట్టబొమ్మ పూజాహెగ్డే తన చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేసింది.(బుట్ట బొమ్మ చేతుల మీదుగా ‘ఏమైపోతానే’)
ప్రస్తుతం యువతను ఉర్రూతలూగిస్తున్న ‘నీలి నీలి ఆకాశం..’ పాటను సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ప్రేమికులకు అంకితమిస్తూ ట్వీట్‌ చేశాడు.
► ‘15-18-24 లవ్‌ స్టోరీ’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హీరోయిన్‌ మెహరీన్‌ రిలీజ్‌ చేసింది. ఈ చిత్రంలో నిఖిలేశ్వర్, కీర్తన్, యువరాజ్‌, సిమ్రాన్ సానియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 15, 18, 24 సంవత్సరాల వయసులో ప్రేమ ఎలా ఉంటుందన్న విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు: మడుపూరి కిరణ్‌ కుమార్‌, నిర్మాత: శ్రవంతి ప్రసాద్‌ (రాశీ ఖన్నా బెదిరించేది)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా